Bigg Boss 7 Telugu Promo: నువ్వు బిగ్ బాస్ ఇంట్లో ఏం సాధించావు.. చెడ్డ పేరు తెచ్చుకున్నావు అంతే..!

బిగ్ బాస్ సీజన్ 7 సెకండ్ డే నామినేషన్ ప్రోమో వచ్చేసింది. ఈ నామినేషన్ ప్రక్రియలో శోభ-రతిక, యావర్- అశ్విని, భోలే- అమర్ మధ్య వాదనలు జరిగాయి. ఇక భోలే.. అమర్ తో వాదిస్తూ నువ్వు ఈ బిగ్ బాస్ ఇంట్లో ఏం సాధించావు.. చెడ్డ పేరు తెచ్చుకున్నావని అన్నాడు భోలే. దానికి అమర్ కౌంటర్ ఇస్తూ.. అవును 'I am Here As a Bad Boy" మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉందా.. అంటూ రెచ్చిపోయాడు.

Bigg Boss 7 Telugu Promo: నువ్వు  బిగ్ బాస్ ఇంట్లో ఏం సాధించావు.. చెడ్డ పేరు తెచ్చుకున్నావు అంతే..!
New Update

Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈరోజు నామినేషన్ ప్రోమో విడుదలైంది. నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగినట్లు కనిపించింది. ఇక భోలే, అమర్ మధ్య నామినేషన్ వాదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

publive-image

ఈరోజు ప్రోమోలో యావర్.. శోభను నామినేట్ చేశాడు. శోభను నామినేట్ చేస్తూ యావర్ చెప్పిన రీజన్.. లాస్ట్ వీక్ జరిగిన టాస్క్ లో ఫౌల్ గేమ్ ఆడావాని చెప్పాడు. దానికి శోభ ఆ టాస్క్ లో చాలా మంది ఫౌల్ ఆడారు, నా ఒక్కదాని గురించే ఎందుకు మాట్లాడుతున్నావని అడిగింది. దానికి  యావర్ ఎందుకంటే.. నిన్ను నామినేట్ చేస్తున్నాను కదా.. అందుకే నీ గురించి మాత్రం మాట్లాడుతున్నానని కౌంటర్ ఇచ్చాడు శోభకు.

ఆ తర్వాత యావర్.. అశ్విని ని నామినేట్ చేశాడు. దాంతో అశ్విని నీ దగ్గర నుంచి నేను ఇది అస్సలు ఊహించలేదు.. అసలు నీ దగ్గర ఒక వ్యాలిడ్ రీజన్ లేదు.. ఎదో చేయాలని చేస్తున్నావు.. నీ నామినేషన్ చూస్తుంటే  నవ్వొస్తుంది నాకు అని యావర్ తో వాదించింది.

publive-image

ఈ నామినేషన్ ప్రక్రియలో శోభ, రతిక మధ్య గొడవ జరిగింది. రతిక.. శోభను నువ్వు గ్రూప్స్ గా ఆడుతున్నావా..?  అని అడిగింది.  దానికి శోభ అవును.. వీళ్లందరితో బయట మాట్లాడుకొని వచ్చానని చెప్పింది. దాంతో రతిక  ఈ వెటకారమే వద్దు అంటూ శోభ పై అరిచేసింది.

publive-image

అమర్, భోలే ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక అమర్ భోలేను నామినేట్ చేస్తూ.. మీరు నన్ను.. నామినేట్ చేసిన విధానం నాకు నచ్చలేదు  దానికి భాదతో నేను మిమల్ని నామినేట్ చేస్తున్నాని చెప్పాడు. ఆ తర్వాత భోలే మాట్లాడుతూ.. నువ్వు ఈ బిగ్ బాస్ ఇంట్లో ఏం సాధించావు.. చెడ్డ పేరు తెచ్చుకున్నావని అన్నాడు భోలే. దానికి అమర్ కౌంటర్ ఇస్తూ.. అవును 'I am Here As a Bad Boy" మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉందా చెప్పండి అంటూ రెచ్చిపోయాడు. ఇక ప్రోమో చివరిలో శివాజీ, యావర్, అర్జున్, ప్రశాంత్ ఒకరి పై ఒకరు చెయ్యి వేసుకొని ముస్తఫా ..ముస్తఫా అంటూ పాటలు పాడారు.

publive-image

Also Read: Bigg Boss 7 Telugu Promo: అందుకే నీకు మిరపకాయల దండ వేశాను.. ప్రియాంక పై భోలే కామెంట్స్..!

#bigg-boss #bigg-boss-7-telugu #bigg-boss-7 #bigg-boss-7-telugu-latest-updates #bigg-boss-7-promo
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe