/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-36-1-jpg.webp)
Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇక ఈ ప్రోమోలో హోస్ట్ నాగార్జున గత వారంలో హౌస్ మేట్స్ చేసిన తప్పుల గురించి మాట్లాడుతూ వాళ్ళకు గట్టిగానే క్లాస్ ఇచ్చినట్లు కనిపించింది.
ప్రోమోలో నాగార్జున నామినేషన్స్ లో ప్రశాంత్, సందీప్ ఇద్దరి మధ్య జరిగిన 'ఊరోడా' గొడవ గురించి మాట్లాడుతూ.. ప్రశాంత్ ఆరోజు సందీప్ నిన్ను ఊరోడా అనలేదని ఒట్టు వేశాడు మరి నువ్వెందుకు వేయలేదు, అందుకే ఒకరి పై నింద వేసేటప్పుడు అది నిజామా, కాదా అని తెలుసుకో. అయినా ఊరోడా అనేది తప్పా.. ఇక్కడ అందరు ఊరు నుంచి వచ్చిన వాళ్ళే, అందరికి అన్నం పెట్టేది ఆ ఊరే, మా నాన్న ఊరోడు అని నేను గర్వంగా చెప్తాను అంటూ ప్రశాంత్ పై నాగార్జున కాస్త ఫైర్ అయ్యారు.
ఇక భోలే షావలి శోభను.. నీకు ఎర్రగడ్డనే దిక్కు అని అన్న విషయం పై కూడా నాగార్జున క్లాస్ ఇచ్చారు. ఆ తర్వాత భోలే విషయంలో ప్రియాంక ప్రవర్తించిన తీరు పై మాట్లాడుతూ 'ఒకసారి నోరు జారితే తర్వాత సారీ చెప్పిన ప్రయోజనం లేదు అంటూ ప్రియాంకకు కూడా క్లాస్ ఇచ్చారు.
అంతే కాదు శోభ, తేజ కోసం పంపిన కేక్ అమర్ తిన్నాడు. ఆ విషయంలో అమర్, తేజ, శోభ ముగ్గురిని తిట్టారు నాగార్జున. అమర్.. నీకు అన్ని దాంట్లో తొందర ఎక్కువేన, ఆ కేక్ తినడం వల్ల నీకు చాలా నష్టం జరగబోతుంది అంటూ అమర్ కు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున. ఇక ఈరోజు ప్రోమోలో నాగార్జున అందరి తప్పులను కుండ బద్దలుకొట్టి మరీ చెప్తున్నారు. ప్రోమో చాలా ఆసక్తిగా కనిపించింది ఇక ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
Also Read: Bigg Boss 7 Telugu: అందరి ముందు ఏడవలేకపోతున్న.. ఎమోషనల్ అయిన శివాజీ ..!