Bigg Boss 7 Telugu Promo: ముందుంది ముసళ్ళ పండగ.. ఇది ముగింపు కాదు.. తేజకు బిగ్ బాస్ షాక్..!

బిగ్ బాస్ సీజన్ 7 గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈరోజు ప్రోమోలో కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా గౌతమ్, ప్రశాంత్ ఇద్దరు పోటీ పడ్డారు. వీళ్లిద్దరి మధ్య పోటీ గట్టిగానే జరిగినట్లు కనిపించింది. ఆ తర్వాత బిగ్ బాస్ తేజకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు తేజ పేరుతో.. "ఇది ముగింపు కాదు.. ముందుంది ముసళ్ళ పండగ అని రాసి ఒక కేక్ పంపారు". అసలు బిగ్ బాస్ ఈ కేక్ ఎందుకు పంపారు అని ఇంటి సభ్యులందరు ఆశ్చర్యంగా ఉండిపోయారు. ఈ కేక్ ఎందుకు పంపారు అనేది తెలియాలి అంటే ఎపిసోడ్ చూడాల్సిందే..

New Update
Bigg Boss 7 Telugu Promo:  ముందుంది ముసళ్ళ  పండగ.. ఇది ముగింపు కాదు.. తేజకు బిగ్ బాస్ షాక్..!

Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7 ఈరోజు ప్రోమోలో హౌస్ మేట్స్ కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొన్నారు. ఈ కెప్టెన్సీ టాస్క్ గులాబీపురం, జిలేబీపురం ఈ రెండు టీమ్స్ మధ్య జరిగింది. బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులకు ఇచ్చిన టాస్క్ 'స్పేస్ షిప్ ఛాలెంజ్' ఈ టాస్క్ లో  ఏ టీం సభ్యులు ముందుగా షిప్ ను చార్జ్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ గా ఎంపిక అవుతారని బిగ్ బాస్ (Bigg Boss) తెలిపారు.

ఈ టాస్క్ లో జిలేబీపురం టీమ్ నుంచి ప్రశాంత్ (Pallavi Prashanth), గులాబీపురం టీమ్ నుంచి గౌతమ్ (Goutham) ఆడారు. బిగ్ బాస్ ఏర్పాటు చేసిన ఆ చార్జింగ్ పాయింట్స్ ను కరెక్ట్ గా తీసుకెళ్లి షిప్ కి చార్జ్ చేయాలి ఇక వీళ్లిద్దరి మధ్య గట్టిగానే పోటీ జరిగింది ఎవరు విన్ అయ్యారు అనేది నైట్ ఎపిసోడ్ లో తెలుస్తుంది.

Also Read: గూగుల్ పే గుడ్ న్యూస్ .. ఇక నుంచి గూగుల్ పే లో కూడా లోన్స్..!

తేజకు బిగ్ బాస్ కేక్

గత సీజన్ లో 'ఈ కేక్ తినే అర్హత ఎవరికి ఉంది' అంటూ బిగ్ బాస్ ఇంట్లోకి ఒక కేక్ పంపించాడు. ఇప్పుడు కూడా బిగ్ బాస్ ఇంట్లోకి ఒక కేక్ పంపారు అయితే బిగ్ బాస్ దాని పై 'తేజ ఇది ముగింపు కాదు.. ముందుంది ముసళ్ళ పండగ' అని రాసి పంపారు. దాంతో తేజతో సహా ఇంటి సభ్యులంతా.. అసలు బిగ్ బాస్ ఎందుకిలా పంపారు అంటూ ఆశ్చర్యంగా చూస్తారు.

publive-image

కేక్ నేను తినేస్తా..

బిగ్ బాస్ తేజ కోసం పంపిన కేక్ తేజ మాత్రమే తినాలా ..? లేదా ఇంటి సభ్యులు ఎవరైనా తినొచ్చా అనే విషయం పై కాస్త డిస్కషన్ జరిగినట్లు ప్రోమోలో కనిపించింది. ఇక్కడ అమర్ (Amar) తేజకు మధ్య కాస్త గొడవ కూడా జరిగినట్లు తెలుస్తుంది. అమర్.. తేజతో మీరు తినకపోతే నేను తినేస్తా అంటాడు దాంతో తేజ ఈ కేక్ నాకు పంపారు నేను డిసైడ్ చేసినప్పుడే తినాలి అంటూ వాదించాడు. మరి ఆ కేక్ ఎవరు తిన్నారు.. అనేది ఎపిసోడ్ లో తెలుస్తుంది.

Also Read: బంగారం కొనుగోలు దారులకు బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన ధరలు.. ఈసారి ఎంతంటే..

తేజ చేతి పై శోభ టాటూ

తేజకు బిగ్ బాస్ మరో షాకిచ్చాడు.. తేజ మీరు శోభ (Shobha) పేరు టాటూ వేయించుకోవాలి అని చెప్తాడు. దాంతో తేజ ఏంటి బిగ్ బాస్ ఇది అసలే నాకు పెళ్లి కాలేదు ఇలా వేయించుకుంటే బాగోదు అంటూ బిగ్ బాస్ తో ఫన్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ కాసేపు తర్వాత బిగ్ బాస్.. తేజ మీకోసం టాటూ డిజైన్స్ వచ్చాయి అంటూ తేజతో చెప్తాడు. అప్పుడు తేజ బిగ్ బాస్ జోక్ చేస్తున్నారా ఏంటి అంటూ అయోమయంలో కనిపించాడు.

Advertisment
తాజా కథనాలు