/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-08T185843.045-jpg.webp)
Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లోకి ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లో ఈ ఫ్యామిలీ వీక్ కోసం ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొంత మంది ఇంటి సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ రాకతో బిగ్ బాస్ ఇల్లంతా చాలా సందడిగా మారింది. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో మన పాట బిడ్డ భోలే వైఫ్ ఇంట్లోకి వచ్చింది.
ఇంటి సభ్యులంతా భోలే పాటలకు స్టెప్పులేస్తూ.. ఉండగా భోలే వైఫ్ సడన్ గా ఇంట్లోకి రావడంతో అందరు షాక్ అయ్యారు. ఇక భోలే తన భార్యను చూస్తూ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత తన భార్యను ఇంటి సభ్యులకు పరిచయం చేశాడు భోలే. భోలే వైఫ్ గేమ్ గురించి మాట్లాడుతూ.. మొదటి రెండు వారాలు నీ ఆట బాగుంది.. ఇంకా బాగా ఎంటర్ టైన్ చేయాలని చెప్పింది. దానికి భోలే నేను ఇక్కడికి పాట బిడ్డగా వచ్చాను.. పాట బిడ్డగనే వెళ్తా అని చెప్పాడు. ఆ తర్వాత భోలే తన భార్యను చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత భోలే వైఫ్ ఇంటి సభ్యులందరికి ప్రేమగా అన్నం తినిపించింది. అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
ఇక భోలే తన వైఫ్ తో కలిసి డాన్స్ వేస్తూ ఆనందంగా కనిపించాడు. ఆనందంలో ఉన్న భోలే బిగ్ బాస్ తో పాటు ఇంటి సభ్యులకు కూడా కృతజ్ఞతలు చెప్పాడు. చివరిలో భోలే తన వైఫ్ తో మాట్లాడుతూ.. "నువ్వు కప్పు కొట్టు అని నన్ను కోరుకోవడం అవసరం లేదు.. ఎందుకంటే భగవంతుండు ఎవరికీ రాసి ఉంటే వారికే ఇస్తాడు".. ఇక్కడ అందరం కష్టపడుతున్నామని చెప్పాడు. చివరిలో భోలే "కష్ట పడ్డాం.. ఇష్ట పడ్డాం.. కప్పు కొడ్డాం" అంటూ సూపర్ డైలాగ్ వేశాడు. బిగ్ బాస్ ఇంట్లోకి ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో ఇంటి సభ్యులంతా చాలా ఆనందంగా కనిపించారు. ఈ ప్రోమో భోలే డైలాగ్స్, పాటలతో చాలా ఎంటర్ టైనింగ్ గా కనిపించింది.