Bigg Boss 7 Telugu: వాళ్లకు దూరంగా ఉండు.. హింట్ ఇచ్చిన ప్రియాంక బాయ్ ఫ్రెండ్..! బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో ఫ్యామిలీ వీక్ హంగామా మొదలైంది. నిన్నటి ఎపిసోడ్ లో ప్రియాంక, భోలే, గౌతమ్ ఫ్యామిలీ మెంబర్స్ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు. By Archana 09 Nov 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో ఫ్యామిలీ వీక్ కోసం హౌజ్ మెట్ చాలా రోజుల నుంచి ఎదురుచూస్తూ ఉంటారు. ఇంక కొంత మంది కంటెస్టెంట్స్ అయితే ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే చాలు అనుకొని కూడా వస్తారు. బిగ్ బాస్ లో ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ అంటే అంత స్పెషల్. ఇక ఈ వారం బిగ్ బాస్ ఇంట్లో ఫ్యామిలీ వీక్ సందడి మొదలైంది. ఇప్పటికే అశ్విని, శివాజీ, అర్జున్ ఫ్యామిలీ ఇంట్లోకి కి రాగ.. ఇక నిన్నటి ఎపిసోడ్ లో గౌతమ్, ప్రియాంక, భోలే ఫ్యామిలీ మెంబెర్స్ ఇంట్లోకి వచ్చారు. నిన్న ఎపిసోడ్ లో ముందుగా గౌతమ్ (Goutham) మదర్ ఇంట్లోకి వచ్చారు. గౌతమ్ మదర్ డైరెక్ట్ గా ఇంట్లోకి రాకుండా.. కన్నయ్య.. కన్నయ్యా అని తన వాయిస్ మాత్రమే వినిపించి గౌతమ్ ను సర్ ప్రైజ్ చేసింది. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చింది. అమ్మను చూసి గౌతమ్ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత గౌతమ్ గేమ్ గురించి మాట్లాడుతూ.. బాగా ఆడుతున్నావు.. కానీ కొన్ని విషయాల్లో ఎక్కువ ఆలోచిస్తున్నావు.. కోపంలో కొన్ని మాటలు రాకుండా చూస్కో.. అలాగే ఏదైనా పాయింట్ అనుకుంటే దాన్ని స్ట్రాంగ్ గా పట్టుకో.. ఎక్కువ వివరణ ఇవ్వకు దాని వల్ల డీవియేట్ అవుతున్నావు.. నీకు భయమేమి వద్దు.. అమ్మ ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి. బయట కూడా అంతా బాగుందని.. గౌతమ్ కు గేమ్ విషయంలో మంచి సలహాలు అయితే ఇచ్చింది. ఆ తర్వాత ప్రియాంక (Priyanka Jain) బాయ్ ఫ్రెండ్ మంచి లవ్ సాంగ్ తో.. చేతిలో రోజ్ ఫ్లవర్ పట్టుకొని చాలా స్పెషల్ గా ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. చాలా రోజుల తర్వాత బాయ్ ఫ్రెండ్ ను చూసి ఎమోషనల్ అయ్యింది ప్రియాంక. 'నేను చాలా మిస్ అయ్యాను నిన్ను' అని ఏడ్చేసింది. ప్రియాంక బాయ్ ఫ్రెండ్.. తన గేమ్ గురించి కొన్ని సలహాలు ఇచ్చాడు. 'ఏదైనా గొడవ జరిగినప్పుడు దాన్ని ఎక్కువ ల్యాగ్ చేయకు.. ఇక్కడ ఫ్రెండ్స్ , బెస్ట్ ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు.. నీ గేమ్ నువ్వు ఆడని చెప్పాడు'. ఇండైరెక్ట్ గా అమర్, శోభ కు దూరంగా ఉండు అన్నట్లుగా చెప్పాడు. ప్రియాంక బాయ్ ఫ్రెండ్ వెళ్లిన తర్వాత.. భోలే (Bhole) వైఫ్ ఇంట్లోకి వచ్చారు. ఇక భోలే ఇల్లంతా చూపిస్తూ.. పాటలు పాడుతూ.. తన భార్యతో సరదాగా కనిపించారు. ఆ తర్వాత బిగ్ బాస్.. 'భోలే మీ వైఫ్ కోసం ఒక మంచి సాంగ్ పాడమని చెప్పగా'.. భోలే మంచి సాంగ్ పాడి తన భార్యను సర్ ప్రైజ్ చేశాడు. మొదటి నుంచి ఎపిసోడ్ కాస్త ఎమోషనల్ గా అనిపించినా.. చివరిలో భోలే పాటలు, డైలాగ్స్ తో చాలా ఆనందంగా ముగిసింది. Also Read: Bigg Boss 7 Telugu Promo: “కష్ట పడ్దాం.. ఇష్ట పడ్దాం.. కప్పు కొడ్దాం”.. భలే డైలాగ్ చెప్పిన భోలే! #bigg-boss-7-telugu #bigg-boss-7 #bigg-boss-7-telugu-latest-updates #bigg-boss-7-promo మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి