Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ ఇంట్లోకి ప్రియాంక బాయ్ ఫ్రెండ్.. 'పెళ్ళెప్పుడు చేసుకుందాం'..!

బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో ఫ్యామిలీ హంగామా మొదలైంది. తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ కుమార్ బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. చాలా రోజుల తర్వాత తనను చూసి ప్రియాంక ఎమోషనల్ గా ఫీల్ అయినట్లు ప్రోమోలో కనిపించింది.

New Update
Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ ఇంట్లోకి ప్రియాంక బాయ్ ఫ్రెండ్.. 'పెళ్ళెప్పుడు చేసుకుందాం'..!

Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7.. హౌస్ మేట్స్  బిగ్ బాస్ ఇంట్లో ఫ్యామిలీ వీక్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ వారం ఇంట్లోకి ఫ్యామిలీ మెంబర్స్ ను పంపి అందరిని సర్ ప్రైజ్ చేశారు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో శివాజీ, అశ్విని, అర్జున్, ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోకి వచ్చారు. ఇక మిగతా ఇంటి సభ్యులు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ఎప్పుడొస్తాయా.. అని వెయిట్ చేస్తూ ఉన్నారు. తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమోలో ప్రియాంక (Priyanka Jain) బాయ్ ఫ్రెండ్ శివ కుమార్ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు.

publive-image

శివ కుమార్ (Shiva Kumar) ప్రియాంక ఇద్దరు కలిసి ఒక సీరియల్ లో నటించారు. ఆ సీరియల్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఇక బిగ్ బాస్ ఇంట్లోకి ప్రియాంక బాయ్ ఫ్రెండ్ మంచి సాంగ్ తో స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు. తనను చూడగానే ప్రియాంక చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి ఏడ్చేసింది కూడా. ఆ తర్వాత బిగ్ బాస్ సాంగ్ ప్లే చేయగానే ఇంటి సభ్యులంతా కలిసి డాన్స్ వేస్తూ.. ఎంజాయ్ చేశారు. అంతే కాదు.. రోజ్ ఫ్లవర్ తో ప్రపోజ్ చేసి ప్రియాంకను సర్ ప్రైజ్ చేశాడు.

publive-image

శివ కుమార్ ప్రియాంకతో తన గేమ్ గురించి మాట్లాడుతూ.. చాలా బాగా ఆడుతున్నావని చెప్పాడు. ఆ తర్వాత 'నేను చాలా మిస్ అయ్యాను నిన్ను' అంటూ ఎమోషనల్ అయ్యింది ప్రియాంక. ఆ తర్వాత పెళ్ళెప్పుడు చేసుకుందాం అంటూ.. ఫన్నీగా మాట్లాడింది.  ప్రియాంక తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుండగా.. శివ కుమార్.. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయం ఆసన్నమైందని తెలిపారు బిగ్ బాస్. ఇక శివకుమార్ వెళ్ళేటప్పుడు ఏడుస్తూ ఎమోషనల్ అయ్యింది ప్రియాంక. ఈ  రోజు ప్రోమో చూస్తుంటే.. ఎపిసోడ్ కూడా చాలా ఎమోషనల్ గా ఉండబోతున్నట్లుగా  కనిపించింది.  మిగతా ఇంటి సభ్యులు కూడా నెక్స్ట్ ఎవరి  ఫ్యామిలీ మెంబర్ వస్తారా అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

publive-image

Also Read: Bigg Boss 7 Telugu Promo: కన్నయ్యా.. కన్నయ్యా.. ఇంట్లోకి గౌతమ్ మదర్ సర్ ప్రైజ్ ఎంట్రీ..!

Advertisment
తాజా కథనాలు