Bigg Boss 7: ఇవే తగ్గించుకుంటే మంచింది.. పల్లవి ప్రశాంత్ పై వైరల్ గా మారిన మీమ్!

నాగార్జున ఇచ్చిన మొక్క విషయంలో ప్రశాంత్ ప్రదర్శిస్తున్న అతి వినయం పై సోషల్ మీడియాలో ఓ మీమ్ బాగా వైరలవుతుంది.

Bigg Boss 7: ఇవే తగ్గించుకుంటే మంచింది.. పల్లవి ప్రశాంత్ పై వైరల్ గా మారిన మీమ్!
New Update

Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 లో కామన్ మ్యాన్ క్యాటగిరిలో ఎంట్రీ ఇచ్చాడు మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. మొదట్లో ప్రతి విషయంలో రైతు బిడ్డ అంటూ సింపతీ గేమ్ ఆడుతున్నాడని ఇంటి సభ్యులంతా తనను నామినేట్ చేసారు. కానీ బిగ్ బాస్ ఇంట్లో అందరు ఒక వైపుంటే శివాజీ మాత్రం మన రైతు బిడ్డను సపోర్ట్ చేస్తూనే వచ్చాడు.

ఇక మొదట్లో ప్రశాంత్ రతికతో ఎక్కువగా మాట్లాడటం, కంటెంట్ కోసం వాళ్లిద్దరూ అనవసరంగా గొడవ పడటం ఇలా చాలా చేసారు. అలాగే కంటెంట్ కోసం వాళ్ళిద్దరి మధ్య ఎదో ట్రాక్ నడుస్తున్నట్లు పోట్రె చేసారు.ఇదంతా తనకు నెగెటివ్ అవుతుందేమో అనుకున్న రతిక సడన్ గా ప్రశాంత్ పై ఆరోపణలు చేస్తుంది. దాంతో రతికకు బలైన రైతు బిడ్డ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వచ్చాయి. మొదటి నుంచి కూడా ప్రశాంత్ కింద కూర్చోవడం, నెల పై పడుకోవడం చేయడంతో ఇంటి సభ్యులకు ప్రశాంత్ సింపతీ గేమ్ ఆడుతున్నడని ఆరోపించారు.

ఇక ప్రశాంత్ కు నాగార్జున మొదట్లో ఇచ్చిన మొక్క ఎండిపోవడంతో. ఇంకో మొక్క ఇచ్చి దీన్ని కాపాడుకోవాలని రైతు బిడ్డకు చెప్తాడు. ఇక మన రైతు బిడ్డ ఆ మొక్కను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. రోజు ఉదయాన్నే లేచి దానికి నీళ్లు పోయడం, మొక్కకు దండం పెట్టుకోవడం చేస్తున్నాడు.

ఇప్పుడు ఆ మొక్క విషయంలో ప్రశాంత్ ప్రదర్శిస్తున్న అతి వినయం పై సోషల్ మీడియాలో ఓ మీమ్ బాగా వైరలవుతుంది. శివాజీ, ప్రశాంత్ ఇద్దరు కలిసి మొక్కకు నీళ్లు పోయడానికి మొక్క దగ్గరకు వెళ్లారు అప్పుడు మన రైతు బిడ్డ అతి వినయంతో చెప్పులు విప్పి వెళ్తాడు. అప్పుడు శివాజీ నువ్వు మరీ ఓవర్ చేయకు రా.. పొలం దగ్గరికి వెళ్తే చెప్పులు వేసుకొనే వెళ్తావు కదా , మరి ఇప్పుడు ఎందుకు ఈ ఓవర్ యాక్షన్ అన్నట్లుగా అంటాడు . ఇక దీని పై సోషల్ మీడియాలో మన మీమర్లు తెగ మీమ్స్ చేస్తున్నారు. చెయ్ అతి చేయకు, ఇవే తగ్గించుకుంటే మంచిది అంటూ ప్రశాంత్ అతి వినయం పై నెట్టింట్లో మీమ్స్ వైరలవుతున్నాయి.

Also Read: Bigg Boss 7 Telugu: పోటుగాళ్ళు VS ఆటగాళ్లు..! పాపం అమర్.. టార్గెట్ అయిపోయాడా..?

#bigg-boss-memes #bigg-boss-pallavi-prashanth #bigg-boss-7 #bigg-boss-7-telugu-latest-updates
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe