Bigg Boss 7 Telugu: పోటుగాళ్ళు VS ఆటగాళ్లు..! పాపం అమర్.. టార్గెట్ అయిపోయాడా..?

బిగ్ బాస్ లో గేమ్ ఆటగాళ్లు VS పోటుగాళ్ళు గా సాగబోతుందని బిగ్ బాస్ ప్రకటిస్తారు. బిగ్ బాస్ హౌస్ లో ఆడియన్స్ కు ఎంతో ఇష్టమైన ప్రక్రియ నామినేషన్స్ మొదలు పెట్టారు. దీంతో మొదట బిగ్ బాస్ పోటుగాళ్ళు మాత్రమే నామినేట్ చేస్తారని ట్విస్ట్ ఇస్తాడు.

Bigg Boss 7 Telugu: పోటుగాళ్ళు VS ఆటగాళ్లు..!  పాపం అమర్.. టార్గెట్ అయిపోయాడా..?
New Update

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా గా సాగుతుంది. బిగ్ బాస్ 2.0 అనే కొత్త కాన్సెప్ట్ తో వీకెండ్ ఎపిసోడ్ లో 5 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో గేమ్ మరింత ఆసక్తిగా మారబోతున్నట్లు అనిపిస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా అర్జున్, అశ్విని, నయని పావని, పూజ, భోలే షావలి వచ్చారు. ఇప్పుడు ఇక గేమ్ ఆటగాళ్లు VS పోటుగాళ్ళు గా సాగబోతుందని బిగ్ బాస్ ప్రకటిస్తారు. బిగ్ బాస్ హౌస్ లో ఆడియన్స్ కు ఎంతో ఇష్టమైన ప్రక్రియ నామినేషన్స్ మొదలు పెట్టారు. దీంతో మొదట బిగ్ బాస్ పోటుగాళ్ళు మాత్రమే నామినేట్ చేస్తారని ట్విస్ట్ ఇస్తాడు.

మొదటి రోజే అశ్వినీ ఏడుపులు

పోటుగాళ్ళు నామినేషన్ మొదలవుతుంది. కొత్త కంటెస్టెంట్ అశ్విని శోభాను నామినేట్ చేస్తూ మీరు ప్రియాంకను ఇన్ఫ్లూయెన్స్ చేస్తున్నారు, ఒక గ్రూప్ ఫార్మ్ చేసి అందరు మీ మాటే వినేలా చేసుకుంటున్నారు అని చెప్తుంది. దాంతో శోభా నువ్వు ఊరికే చెప్పేయడం కాదు గ్రూప్ గా ఆడుతున్నామని ఎక్కడ ఆడమో కూడా చెప్పాలంటూ అశ్విని పై అరుస్తుంది. ఇక శోభా మాటలకూ సమాధానం చెప్పలేక అశ్విని నేను ఇక్కడ ఉండలేను బిగ్ బాస్ వెళ్ళిపోతాను అని ఏడ్చేస్తుంది.

టార్గెట్ అయిన అమర్

బయట ఆట చూసి వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో చాలా మంది అమర్ ని నామినేట్ చేస్తారు. వాళ్ళతో పాటు ఇంటి సభ్యుల్లో కూడా మాక్సిమం నామినేషన్స్ అమర్ కే పడతాయి. అమర్ తర్వాత తేజ, సందీప్ కు ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. నాగార్జున స్టేజ్ పై వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ఇప్పటి వరకు జరిగిన ఆటలో ఇద్దరు దమ్ము, ఇద్దరు దుమ్ము గా ఆడుతున్నది ఎవరు అని అడగగా చాలా మంది అమర్, సందీప్ పేర్లే చెప్తారు.

అమర్ కు అర్జున్ క్లారిటీ

ఇక అర్జున్ అయితే బయట మేము నీ ఆటను చూసి చాలా నిరాశ చెందాం.. రోజు రోజు బాగా ఆడతావేమో అని చూసాము కానీ నువ్వు ఉన్నదాని కంటే తగ్గిపోతున్నావ్ తప్ప ఆటలో ముందుకెళ్లట్లేదు. నీకు టాస్క్ అర్థం చేసుకోవడం రావట్లేదని, ఊరికే అరిచేస్తున్నావ్ అని చెప్తాడు. దాంతో అమర్ చాలా ఫీల్ అవుతాడు. ఇండైరెక్ట్ అర్జున్ అమర్ కు తన ఆట బాగాలేదని హింట్ ఇచ్చినట్లే చెప్పాడు. దీన్ని అర్థం చేసుకొని ఆడితే అమర్ గేమ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి  కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఒక అర్జున్ తప్ప మిగతా వాళ్ళందరూ చాలా కామ్ గా కనిపిస్తున్నారు. నామినేషన్స్ లో ఎవ్వరూ వారి పై పెద్దగా ఇంప్యాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. ఇక తేజ నామినేట్ చేయడంతో నయని పావని కూడా ఏడ్చేస్తుంది. ఆటగాళ్లు VS పోటుగాళ్ళు గా మారిన గేమ్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read: Bigg Boss Promo: రాననుకున్నారా, రాలేననుకున్నారా ..? బిగ్ బాస్ లో గౌతమ్ రీ ఎంట్రీ..!

#bigg-boss-7-telugu #bigg-boss-7 #bigg-boss-7-telugu-nomination-list #bigg-boss-7-telugu-latest-updates
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe