Bigg Boss 7 Telugu: నువ్వు చెప్పొద్దయ్య సామీ.. దండం పెట్టిన అమర్

బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. ఇక భోలే అమర్ కు మధ్య జరిగిన వాదనలో భోలే తన పాటలను, కవిత్వాలను కూడా ప్రదర్శించాడు.

Bigg Boss 7 Telugu: నువ్వు చెప్పొద్దయ్య సామీ.. దండం పెట్టిన అమర్
New Update

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నామినేషన్ ఎపిసోడ్ వచ్చిందంటే చాలు ఇంటి సభ్యుల వాదనలతో బిగ్ బాస్ ఇల్లంతా హీట్ ఎక్కిపోతుంది.. ఇక నిన్న నామినేషన్స్ లో  కూడా  జరిగింది అదే. నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్.. ఇంట్లో ఉండడానికి అర్హతలేదని భావించిన ఇంటి సభ్యులను నామినేట్ చేయాలనీ ఆదేశించారు.

ప్రశాంత్ VS అమర్

ముందుగా వచ్చి నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టిన ప్రశాంత్ .. అమర్ ని నామినేట్ చేశాడు. నామినేషన్ ప్రక్రియలో వీళ్లిద్దరి మధ్య వాదనలు జరిగాయి. అమర్ ని నామినేట్ చేస్తూ .. లాస్ట్ వీక్ నన్ను కంటెండర్ రేస్ నుంచి తొలగించడానికి నువ్వు చెప్పిన కారణం నాకు నచ్చలేదని చెప్పాడు. దానికి అమర్.. రేసులో ఉన్న 6 మందిలో నువ్వు ఇంతక ముందు కెప్టెన్ అయ్యావు.. అందుకే వేరే వాళ్లకు అవకాశం ఇచ్చానని తెలిపాడు. దానికి ప్రశాంత్ ఒకసారి కెప్టెన్ అయితే మళ్ళీ అవ్వకూడదని రూల్ ఉందా అని వాదించాడు.

నువ్వు ఫౌల్ గేమ్ ఆడావు

ఇక రతిక వచ్చి శోభ, ప్రియాంకను నామినేట్ చేసింది. వీళ్లిద్దరికీ రతిక చెప్పిన రీజన్.. లాస్ట్ వీక్ జరిగిన 'ఫ్లోట్ ఆర్ సింక్' టాస్క్ లో అమర్ కి ఆన్సర్స్ చెప్పి ఫౌల్ గేమ్ ఆడారని చెప్పింది. దానికి ప్రియాంక.. మరి అమర్ కి నువ్వు  కూడా  ఆన్సర్ చెప్పావు కదా.. మేము ఆడింది ఫౌల్ గేమ్ అయితే.. నువ్వు ఆడింది కూడా ఫౌల్ గేమని కౌంటర్ ఇచ్చింది. శోభ, ప్రియాంక నామినేషన్ విషయంలో రతిక మాట్లాడిన మాటల్లో లాజిక్ లేనట్లుగా కనిపించింది.

నువ్వు చెప్పొద్దయ్య సామీ.. నీకో దండం

భోలే, అమర్ ఇద్దరి మధ్య పెద్ద వాదనే జరిగింది. ఇక నామినేషన్ ప్రక్రియలో  భోలే తన పాటలను, కవిత్వాలను కూడా ప్రదర్శించాడు. భోలే అమర్ ను నామినేట్ చేశాడు. దాని గురించి మాట్లాడుతూ.. లాస్ట్ వీక్ నామినేషన్ లో నేను మాట్లాడుతుంటే నువ్వు కోపంగా కుర్చీని గట్టిగా తన్నావు .. అది నాకు నచ్చలేదని చెప్పాడు. దానికి అమర్ మాట్లాడుతూ .. అసలు మీ దగ్గర నామినేట్ చేయడానికి వ్యాలిడ్ రీజన్ లేదు, ఇదొక రివెంజ్ నామినేషన్ ల ఉందంతే అని చెప్పాడు.  వీళ్లిద్దరి మధ్య చాలా సేపు వాదన జరిగింది. ఇక భోలే చెప్పే కారణాలు వినలేని అమర్.. నువ్వు చెప్పొద్దయ్య సామీ.. నీకో దండం.. ఏం చెప్తావో నీకే అర్థం కాదు అని అన్నాడు.

సేఫ్ గేమ్ ఆడుతున్నాడు

ఆ తర్వాత తేజ, అర్జున్ మధ్య జరిగిన నామినేషన్ కాస్త ఫన్నీ గా కనిపించింది. లాస్ట్ వీక్ సందీప్ ను నామినేట్ చేసినట్లే.. 3 వారల నుంచి నామినేషన్స్ లో లేవు ఒకసారి వెళ్లి వస్తే కాన్ఫిడెన్స్ వస్తుందని అర్జున్ ని  నామినేట్ చేశాడు తేజ. ఈ రీజన్ చెప్పగానే హౌస్ మేట్స్ అంతా ఫన్నీగా నవ్వారు. ఇక అర్జున్ కూడా ఇప్పటికే ముగ్గురిని పంపించావు ఇలా నామినేషన్ వేసి.. బిగ్ బాస్ తేజ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అంటూ ఫన్ చేశాడు అర్జున్.

Also Read: Bigg Boss 7 Telugu Promo: అందుకే నీకు మిరపకాయల దండ వేశాను.. ప్రియాంక పై భోలే కామెంట్స్..!

#bigg-boss #bigg-boss-7 #bigg-boss-7-telugu #bigg-boss-7-promo #bigg-boss-7-telugu-latest-updates
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe