Bigg Boss 7 Telugu: శివాజీ మా డాడీ.. మిస్ యు డాడీ.. కనీళ్ళు పెట్టించిన నయనీ ఎలిమినేషన్

బిగ్ బాస్ సీజన్ 7 ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చు అన్నట్లుగానే షో ముందుకు వెళ్తుంది. ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైకి వచ్చిన నయనీ, శివాజీని చూసి చాలా ఎమోషనల్ అయ్యింది. శివాజీని చూస్తే మా నాన్న లాగే అనిపిస్తాడు.. నేను ఆయన్ని డాడీ అని పిలుస్తాను, నన్ను తన కూతురిలానే చూసుకున్నారు , మిస్ యు డాడీ అంటూ ఏడ్చేసింది. దాంతో శివాజీ కూడా కనీళ్ళు పెట్టుకున్నాడు.

New Update
Bigg Boss 7 Telugu: శివాజీ మా డాడీ.. మిస్ యు డాడీ..  కనీళ్ళు పెట్టించిన నయనీ ఎలిమినేషన్

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చు అన్నట్లుగానే షో ముందుకు వెళ్తుంది. ఇక నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోయే రతిక, శుభ శ్రీ, దామిని వీళ్ళ ముగ్గురిలో ఎవరు రీ ఎంట్రీ ఇవ్వాలనే విషయాన్నీ ఇంటి సభ్యులు వాళ్ళ ఓటింగ్ ద్వారా తెలిపారు.. కానీ వాటి రిజల్ట్స్ సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తానని ప్రేక్షకులలో, ఇంటి సభ్యులలో మళ్ళీ ఒక సస్పెన్స్ క్రియేట్ చేశాడు బిగ్ బాస్.

ఆ తర్వాత 'భగవంత్ కేసరి' ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) హౌస్ ఆట గురించి మాట్లాడి వాళ్ళతో కాస్త కామెడీ కూడా చేశారు. మన పాట బిడ్డ భోలే శ్రీలీలను పొగుడుతూ మంచి సాంగ్ కూడా పాడాడు. ఎపిసోడ్ అంతా సండే ఫన్ డే అన్నట్లుగానే చాలా హ్యాపీ గా సాగింది.. కానీ చివరిలో నయని (Nayani Pavani) ఎలిమినేషన్ తో హౌస్ మేట్స్ అంతా షాక్ అవ్వడంతోపాటు భాదతో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.

నయని ఎలిమినేషన్

నామినేషన్ లో ఉన్న ఏడుగురిలో 5 సేవ్ అయిపోయారు ఇక లాస్ట్ లో నయని, అశ్విని మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. హౌస్ మేట్స్ ఊహించని విధంగా నయని ఎలిమినేట్ అయ్యింది. ఎలిమినేట్ అయ్యాను అని తెలియగానే నయని నేను గేమ్ బాగా ఆడాను, అయినా నేను ఎలిమినేట్ అయ్యాను అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది. నయని తో పాటు ఇంటి సభ్యులంతా కనీళ్ళు పెట్టుకున్నారు.

publive-image

శివాజీ మా నాన్న..మిస్ యు డాడీ

ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైకి వచ్చిన నయనీ, శివాజీ (Sivaji) ని చూసి చాలా ఎమోషనల్ అయ్యింది. శివాజీని చూస్తే మా నాన్న లాగే అనిపిస్తాడు.. నేను ఆయన్ని డాడీ అని పిలుస్తాను, నన్ను తన కూతురిలానే చూసుకున్నారు , మిస్ యు డాడీ అంటూ ఏడ్చేసింది. దాంతో శివాజీ కూడా కనీళ్ళు పెట్టుకున్నాడు.

నన్ను బయటకు పంపించేయండి

నయనీ ఏడుస్తుంటే చూడలేకపోయిన శివాజీ .. ఏదైనా వీలుంటే ఆ అమ్మాయి ప్లేస్ లో నేను వెళ్తాను.. నా ఆరోగ్యం కూడా బాగాలేదు అంటూ నాగార్జునకు చెప్తాడు. దానికి నాగార్జున (Nagarjuna) ఇది ఆడియన్స్ డెసిషన్ ఎవరూ మార్చలేరు అని చెప్పాడు. నయనీ ఎలిమినేషన్ తో బిగ్ బాస్ ఇళ్ళు అంతా ఎమోషనల్ గా మారిపోయింది.

Also Read: Bigg Boss 7 Telugu Promo: నోరు అదుపులో పెట్టుకో.. నా వరకు వస్తే ఊరుకోను..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు