Bigg Boss 7 Telugu: "వీడెవడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్".. మీమ్స్ తో నవ్వించిన నాగార్జున..!

బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా ఈరోజు ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ప్రోమోలో నాగార్జున ఇంటి సభ్యుల పై సోషల్ మీడియాల్ వైరలవుతున్న కొన్ని ఫన్నీ మీమ్స్ చూపించారు. ఆ తర్వాత ప్రతీ ఒక్కరు అక్కడ ఉన్న ఒక మీమ్ తీసుకొని హౌస్ లో ఒకరికి డేడికేట్ చేయాలనీ చెప్పారు నాగార్జున

New Update
Bigg Boss 7 Telugu: "వీడెవడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్".. మీమ్స్ తో నవ్వించిన నాగార్జున..!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్.. 7 శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ఇచ్చిన క్లాస్ తో హౌస్ మేట్స్ అంతా  బుర్ర హీటెక్కిపోయి ఉన్నారు. ఇక తాజాగా ఈ రోజు ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో నాగార్జున.. "అందరు కొంచం టెన్షన్ లో ఉన్నారు.. కాస్త రిలాక్స్ అవ్వడానికి కొన్ని ఫన్నీ మీమ్స్ చూద్దాం" అని చెప్పారు. దాంతో ఇంటి సభ్యులంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాగార్జున హౌస్ లో జరిగిన కొన్ని సన్నివేశాలకు సంబంధించి కొన్ని ఫన్నీ మీమ్స్ చూపించారు నాగార్జున. ముందుగా అమర్, శుభశ్రీ మధ్య జరిగిన నామినేషన్ గొడవ పై "నా మనోభావాలు దెబ్బతిన్నాయి" అంటూ సోషల్ మీడియాలో వైరలవుతున్న కామెడీ మీమ్ ఒకటి చూపించారు. ఆ తర్వాత శోభ, యావర్ గొడవ పై క్రియేట్ చేసిన ఫన్నీ మీమ్ చూసి అందరు నవ్వుకున్నారు.

publive-image

డెడికేట్ ద మీమ్

ఆ తర్వాత నాగార్జున ఇంటి సభ్యులకు "డెడికేట్ ద మీమ్" అని ఒక టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్ మీమ్స్ ఇచ్చారు. ప్రతీ ఒక్కరు ఒక మీమ్ తీసుకొని హౌస్ లో ఒకరికి డేడికేట్ చేయాలనీ చెప్పారు నాగార్జున. ఈ టాస్క్ ఇంటి సభ్యులంతా పాల్గొన్నారు.

publive-image

"వీడెవడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు.. చైల్డ్ ఆర్టిస్ట్"

ముందుగా ప్రియాంక "ఇదేందయ్యా ఇది.. ఇది నేను చూడలేదు" అమర్ కు డేడికేట్ చేసింది. ఆ తర్వాత అర్జున్ "వీడెవడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు.. చైల్డ్ ఆర్టిస్ట్" మీమ్ యావర్ కు డేడికేట్ చేశాడు. దానికి అర్జున్.. "ముందు 5 వీక్స్ నేను బయట ఉన్నప్పుడు యావర్ గురించి అలానే అనుకున్నానని చెప్పాడు".

సర్ సర్ లే.. ఎన్నో అనుకుంటాము.. అన్ని అవుతాయా ఏంటి

ఆ తర్వాత శివాజీ "సర్ సర్ లే.. ఎన్నో అనుకుంటాము.. అన్ని అవుతాయా ఏంటి" మీమ్ డేడికేట్ చేశాడు. ఇది చూసి నాగార్జున 'కరెక్ట్ గా సరిపోయింది' అంటూ ఫన్నీగా నవ్వుకున్నారు. "అమర్ నువ్వు పూర్తిగా మీమ్ మెటీరియల్ అనమాట "అని కామెడీ చేశారు నాగార్జున.

publive-image

Also Read: Bigg Boss 7 Telugu: ఫన్ గేమ్ కాస్త సీరియస్ అయ్యింది.. గొడవ పడిన శోభ, అమర్..!

Advertisment
తాజా కథనాలు