Bigg Boss 7 Telugu: శోభ 'చంద్రముఖి', అమర్ 'గజిని'.. బిగ్ బాస్.. ఫొటోలు సూపర్..!

బిగ్ బాస్ సీజన్ 7.. వీకెండ్ ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో ఇంటి సభ్యులకు గెస్ ద మూవీ టాస్క్ ఇచ్చారు నాగార్జున. గెస్ చేసిన సినిమా పేరుకు ఎవరు సూట్ అవుతారో వాళ్ళ ఫొటోను సినిమా పోస్టర్ గా డిజైన్ చేసి చూపించారు బిగ్ బాస్. ఆ పోస్టర్స్ చూసి అందరు నవ్వుకున్నారు.

Bigg Boss 7 Telugu: శోభ 'చంద్రముఖి', అమర్ 'గజిని'.. బిగ్ బాస్.. ఫొటోలు సూపర్..!
New Update

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా విడుదలైన ప్రోమో ఎంతో వినోదాత్మకంగా కనిపించింది. ప్రోమోలో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులతో ఒక ఫన్నీ గేమ్ ఆడించారు. ఈ గేమ్ లో ఇంటి సభ్యులంతా పాల్గొన్నారు. ఈ ఫన్నీ గేమ్ పేరు "గెస్ ద మూవీ". ఈ టాస్క్ లో ఒక కంటెస్టెంట్ అభినయంతో మూవీ పేరు చూపిస్తే.. మిగతా హౌస్ మేట్స్ ఆ పేరేంటో గెస్ చేయాలి.

publive-image

ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ అంతా మూవీ నేమ్స్ గెస్ చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ సినిమా పేరుకు తగినట్లు ఇంటి సభ్యుల పై పోస్టర్లు డిజైన్ చేసి హౌస్ మేట్స్ కు చూపించారు. బాహుబలిగా అర్జున్, చంద్రముఖి పోస్టర్ లో శోభ, అపరిచితుడు క్యారెక్టర్ లో ప్రశాంత్, గజినీ పోస్టర్ లో అమర్, మహానటిగా పోస్టర్ లో ప్రియాంక ఫొటోను డిజైన్ చేసి చూపించారు. వీటిని హౌస్ మేట్స్ అంతా నవ్వుకున్నారు.

publive-image

publive-image

ప్రోమో చివరిలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు. ఈ సందర్భంగా కీరవాణి .. నాగార్జున నెక్స్ట్ మూవీ 'నా సామీ రంగ' మ్యూజిక్ అందిస్తున్నారని తెలిపారు. ఆ తర్వాత నాగార్జున.. ఇది బిగ్ బాస్ మరి మీ ఇంట్లో బిగ్ బాస్ ఎవరు అంటూ కీరవాణితో సరదాగా మాట్లాడారు.

publive-image

Also Read: Bigg Boss 7 Telugu: “బలంతో పాటు బలగం కూడా ఉండాలి”.. రిగ్రెట్ గా ఫీల్ అయిన అర్జున్ ..!

#bigg-boss-7-telugu #bigg-boss-7 #bigg-boss-7-promo #bigg-boss-7-telugu-latest-updates
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe