Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్..7 ఈ రోజు వీకెండ్ ఎపిసోడ్ కాస్త ఫన్నీగా కాస్త సీరియస్ గా ఉండబోతున్నట్లు కనిపించింది. ముందుగా విడుదల చేసిన ప్రోమోలో నాగార్జున సోషల్ మీడియాలో వైరలవుతున్న కొన్ని ఫన్నీ మీమ్స్ చూపించి అందరినీ నవ్వించారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో ఒక సీరియస్ టాస్క్ ఇచ్చారు.
14 వీక్స్ వాల్ ఆఫ్ బిగ్ బాస్.
నాగార్జున ఇంటి సభ్యులకు ఇచ్చిన టాస్క్ 14 వీక్స్ వాల్ ఆఫ్ బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులు ఈ 14 వారాలలో వారు రిగ్రెట్ గా ఫీల్ అయిన వారం ఏదని భావిస్తారో చెప్పాలని తెలిపారు. ఇంటి సభ్యులంతా వాళ్ళు రిగ్రెట్ గా ఫీల్ అయ్యే సంఘటన జరిగిన వారం పైకి వీల్ ను మూవీ చేసి దాని రీజన్ ఏంటో కూడా నాగార్జునతో చెప్పారు.
బలం ఉంటే సరిపోదు బలగం కూడా ఉండాలి
ఈ టాస్క్ లో ముందుగా అర్జున్ పాల్గొన్నాడు. 13వ వారం తను రిగ్రెట్ గా ఫీల్ అయ్యానని చెప్పాడు. "బలం ఉంటే సరిపోదు జనాల ప్రేమ కూడా ఉండాలని" తెలిసింది. ఆ వారం నేను కష్టపడి ఆడాను కానీ నాకు ఓట్స్ తక్కువగా వచ్చాయి అని చెప్పాడు. ఆ తర్వాత శోభ 9వ వారం గురించి రిగ్రెట్ అవుతున్నాని చెప్పింది. ఆ వారం నేను యావర్ ను పిచ్చోడా చెప్పాల్సింది కాదు అని చెప్పింది.
ఈ వారం రిగ్రెట్ గా ఫీల్ అయ్యాను
ఆ తర్వాత శివాజీ ఈ వారమే నేను రిగ్రెట్ గా ఫీల్ అయ్యానని చెప్పారు. ఈ వారం నేను మాట్లాడిన మాటలు నా వ్యక్తిగతం అనుకున్నాను.. కానీ అవి అందరినీ బాధపెడతాయని మీరు చెప్పాకే తెలుసుకున్నని తెలిపారు. అది ఫ్లోలో పొరపాటున వచ్చిన మాటే.. తప్పుని కూడా ఒప్పుకున్నని చెప్పారు. ఆ తర్వాత శివాజీ అదేంటో నా దరిద్రం.. నాకోసం స్టాండ్ తీసుకున్నప్పుడు ఏదీ జరగలేదు.. మిగతా వాళ్ళ కోసమే అని కాస్త బాధపడ్డారు శివాజీ. దాని నాగార్జున నువ్వు తీసుకున్న స్టాండ్ రైట్.. నీ ఫీలింగ్ రైట్.. నువ్వు ఆడుతున్న తీరు రైట్.. నీ ఫిలాసఫీ రైట్ అని చెప్పారు. శివాజీ నువ్వు ఓట్ అపీల్ చేసినప్పుడు చెప్పిన ఒక మాట నాకు చాలా నచ్చింది. బ్రతుకు.. బ్రతికించు అదే నీ ఫిలాసఫీ అని నాకు అర్థమైంది అని మెచ్చుకున్నారు నాగార్జున.
Also Read: Samantha Ruth Prabhu: బాలీవుడ్ రియాలిటీ షోలో సమంత..!