Bigg boss 7 Telugu: ఛీ.. తూ.. ఇలా అంటే బాగుందా.. యావర్ పై నాగార్జున సీరియస్..! బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా వీకెండ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో నాగార్జున శోభ, యావర్ మధ్య జరిగిన గొడవ గురించి క్లారిటీ ఇచ్చారు. గొడవలో వారి మాటలు, ప్రవర్తన పై గట్టిగా క్లాస్ ఇచ్చారు నాగార్జున. గొడవలో యావర్ ఛీ.. తూ అని చెప్పడం పై సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. By Archana 09 Dec 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Bigg boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఇంకా రెండు వారాలు మాత్రమే ఉంది. ముందు నుంచి సాఫీగా సాగినప్పటికీ చివరికి వచ్చేసరికి గొడవలతో బిగ్ బాస్ హౌస్ రచ్చ రచ్చగా మారింది. ఇక ఈ వారం ప్రతీ టాస్క్ లో ఏదో ఒక గొడవ జరుగుతూనే వచ్చింది. ఇక ఈరోజు వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో నాగార్జున శోభ, యావర్ మధ్య జరిగిన గొడవ గురించి క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు గొడవలో వారి మాటలు, ప్రవర్తన పై సీరియస్ గా క్లాస్ ఇచ్చారు. శివాజీ పై ఆరోపణలు.. నాగార్జున క్లారిటీ ముందుగా నాగార్జున శోభను కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ఓ వీడియో చూపించారు. ఆ వీడియోలో శోభ.. వీకెండ్ ఎపిసోడ్ లో A to Z అన్నీ చెప్పకపోతే నా పేరు శోభనే కాదు అని చెప్పింది. ఈ విషయం నాగార్జున స్పందిస్తూ "A to Z ఏం చెప్పాలనుకున్నావో చెప్పేసి శోభ "అని చెప్పారు. దానికి శోభ .. "ప్రతీ సారి శివాజీ.. ఫెవరిజం అని చెబుతున్నారు.. లాస్ట్ వీక్ వరకు వచ్చేసాం.. ఎక్కడ ఫెవరిజం చూపించానో నాకు క్లారిటీ కావాలి" అని అడిగింది. ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ.. "సంచాలకుడిగా.. నువ్వు కేవలం ప్రియాంకను ఎంకరేజ్ చేయడం ఫెవరిజం కాదా"..? అని ప్రశ్నించాడు. "నాకు ప్రియాంకకు సపోర్ట్ చేయాలనీ ఉంది అందుకే ఎంకరేజ్ చేశానని చెప్పింది". "మరి నువ్వు ఓపెన్ గా చెప్పినప్పుడు ఫెవరిజం అనే అంటారు కదా" అని క్లారిటీ ఇచ్చారు నాగార్జున. అందరినీ రెచ్చగొడుతున్నావు ఆ తర్వాత శోభ.. "ఈ వారం అంతా నా మైండ్ డిస్టర్బ్ గా ఉంది సార్ అని చెప్పింది". నీ మైండ్ డిస్టర్బ్ గా ఉండి.. ఆటను డిస్టర్బ్ చేస్తున్నావు.. అందరినీ రెచ్చగొడుతున్నావు అని క్లాస్ ఇచ్చారు. "నేను కావాలని ఏదీ చేయలేదు సార్ అని ఎమోషనల్ అయ్యింది" శోభ. "మరి బాల్ టాస్క్ లో యావర్ తో చేసింది ఏంటి.. గొడవ మొదలు పెట్టింది నువ్వే.. ఆ తర్వాత యావరే నన్ను గట్టిగా కొట్టాడు అని చెప్పింది కూడా నువ్వే" అని సీరియస్ గా మాట్లాడారు నాగార్జున. దానికి శోభ "నేను యావర్ కొట్టాడు అని చెప్పలేదు సార్" అని గట్టిగా మాట్లాడింది. యావర్ నన్ను గట్టిగా కొట్టాడు శోభ చెప్పిన మాటల పై క్లారిటీ కోసం .. నాగార్జున యావర్, శోభ గొడవకు సంబంధించిన వీడియో ప్లే చేశారు. ఆ వీడియోలో శోభ "యావర్ నన్ను కొట్టాడు" అని చెప్పింది. ఇక వీడియో చూసాక సైలెంట్ అయిపొయింది శోభ. ఆ తర్వాత యావర్ శోభతో ప్రవర్తించిన తీరు పై కోప్పడ్డారు. యావర్ తో మాట్లాడుతూ.. "శోభను ఛీ.. తూ అని చెప్పడడం బ్యాడ్ బిహేవియర్ అని యావర్ పై సీరియస్ అయ్యారు నాగార్జున. #bigg-boss-7-telugu #bigg-boss-7 #bigg-boss-7-telugu-latest-updates #bigg-boss-7-promo మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి