Bigg Boss 7 Telugu: "నీ కలర్స్ అన్నీ చూశాను".. అందుకే మాట్లాడుతున్నాను..!

బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' గెలవడానికి మరో సారి అవకాశం ఇచ్చారు. దీని కోసం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో గెలిచిన ప్రశాంత్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ సొంతం చేసుకున్నాడు.

New Update
Bigg Boss 7 Telugu: "నీ కలర్స్ అన్నీ చూశాను".. అందుకే మాట్లాడుతున్నాను..!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ లో భాగంగా ఇంటి సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. ఈ నామినేషన్ ప్రక్రియలో శివాజీ, గౌతమ్ ఇద్దరి మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. ప్రియాంక, శివాజీ మధ్య కూడా వాదనలు జరిగాయి.

publive-image

నీ కలర్స్ అన్నీ చూశాను

నామినేషన్ ప్రక్రియలో భాగంగా ప్రియాంక శివాజీని నామినేట్ చేసింది. లాస్ట్ వీక్ నామినేషన్స్ లో రాజమాతలుగా.. నలుగురు కలిసి తీసుకున్న డెషిషన్ లో.. మీరు నాది మాత్రమే తప్పని.. నన్ను నామినేట్ చేయడం నాకు నచ్చలేదు. దానికి శివాజీ స్పందిస్తూ.. ఆ రోజు అందరి కంటే నువ్వే గట్టిగా మాట్లాడావు.. నాకు వినిపించింది... అది అందరికీ తెలుసు అని వాదించాడు. ఇక ప్రియాంక "ఈ హౌస్ లో సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారో నాకు తెలుసు అంటూ మాట్లాడింది. ‘నువ్వు జీనియస్, బ్రిలియెంట్, ఐ యామ్ ఎక్స్‌ప్టెడ్.. థాంక్యూ’’ అని శివాజీ వెళ్ళిపోయాడు. ఎందుకిలా మాట్లాడుతున్నారు అని ప్రియాంక శివాజీని ప్రశ్నించింది. ఇక శివాజీ.. నీ దగ్గర నేను డిఫెండ్ చేసుకోను.. అంతా మీకు నచినట్లే జరుగున్నాయి.. నీ రక రకాల కలర్స్ చూస్తున్నా కాబట్టే చెబుతున్న అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

publive-image

నేను రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాను

నిన్న నామినేషన్స్ లో యావర్.. అర్జున్ ను నామినేట్ చేశాడు. దానికి అర్జున్ ఇలాంటి సిల్లీ రీజన్ చెప్పి నన్ను.. నామినేట్ చేశావు అంటూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు. ఇన్ని రోజులు.. నువ్వు నిజాయితీ గా ఆడుతున్నావని.. నిన్ను ఎంకరేజ్ చేశాను. కానీ ఇప్పుడు నీ నామినేషన్ చూస్తుంటే.. నేను రిగ్రెట్ ఫీల్ అయ్యాను.. ఇక ఇప్పటి నుంచి హౌస్ లో నుంచి వెళ్లే వరకు నీతో మాట్లాడడం జరగదు అని ఎమోషనల్ అయ్యాడు అర్జున్.

publive-image

ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్

గత బిగ్ బాస్ సీజన్స్ లో ఎప్పుడూ జరగనట్లు.. ఈ సీజన్ బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలవడానికి రెండో సారి అవకాశం ఇచ్చారు.
ఈ టాస్క్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు డిఫరెంట్ ఆకారాల్లో ఉన్న వస్తువులను ఇచ్చి వాటిని ఒక పెడస్టాల్ పై బ్యాలన్స్ చేయాలని చెప్పారు.
ఈ టాస్క్ లో ప్రశాంత్ అందరికన్నా ఎక్కువ సేపు బ్యాలన్స్ చేసి "ఎవిక్షన్ ఫ్రీ పాస్" గెలుచుకున్నాడు.

publive-image

Also Read: Gunti Nagaraju: ప్రచారం ఆపాలని గుంటి నాగరాజుకు బెదిరింపులు.. ఏడుస్తూ వీడియో!

Advertisment
Advertisment
తాజా కథనాలు