Bigg Boss 7 Telugu: "వామ్మో మీలా అయితే నటించలేను సార్".. శివాజీ పై శోభ కామెంట్స్..!

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో ప్రియాంక, అర్జున్, శివాజీ ఓట్ అపీల్ ఛాన్స్ పొందడానికి టాస్క్ లో పాల్గొన్నారు. టాస్క్ మధ్యలో శివాజీ, శోభ మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో శోభ"వామ్మో మీలా అయితే నటించలేను సార్" అని శివాజీ పై కామెంట్స్ చేసింది.

Bigg Boss 7 Telugu: "వామ్మో మీలా అయితే నటించలేను సార్".. శివాజీ పై శోభ కామెంట్స్..!
New Update

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. ఫినాలే వీక్ దగ్గరకు వచ్చినందున బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ప్రేక్షకులతో నేరుగా ఓట్ అపీల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇప్పటికే శోభ, అర్జున్.. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో గెలిచి ఓట్ అపీల్ చేసుకున్నారు. ఇక ఈ రోజు తాజాగా బిగ్ బాస్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో చివరి రౌండ్ వరకు చేరుకున్న ప్రియాంక, అర్జున్, శివాజీ నెక్స్ట్ రౌండ్ లో పాల్గొన్నారు. ఈ టాస్క్ లో కంటెండర్స్ బిగ్ బాస్ ఇచ్చిన జాకెట్ ధరించి ఒకరి పై ఒకరు బాల్స్ విసరాలి. ఎండ్ బజార్ మోగే సమయానికి ఎవరి జాకెట్ పై ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు రేసు నుంచి ఔట్ అవుతారని బిగ్ బాస్ తెలిపారు.

publive-image

నేను ఆడను .. ప్రతీ సారీ ప్రియాంక, ప్రియాంక ఏంటీ

ప్రోమోలో శివాజీ, ప్రియాంక, అర్జున్ ఈ టాస్క్ లో పాల్గొన్నారు. ముగ్గురు ఒకరి పై ఒకరు బాల్స్ విసురుకోవడం మొదలు పెట్టారు. ఇక శోభ "ప్రియాంక జాగ్రత్త, ప్రియాంక ఫోకస్, ప్రియాంక చూసుకో" అంటూ పదే పదే ప్రియాంక పేరు చెబుతూ తనను ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేసింది. కానీ గేమ్ మధ్యలో పదే పదే శోభ.. ప్రియాంక పేరు  చెప్పడంతో శివాజీ కాస్త ఇరిటేట్ అయినట్లు ప్రోమోలో కనిపించింది. గేమ్ మధ్యలోనే "నేను ఆడనయ్యా.. పదే పదే ప్రియాంక అంటుంటే.. ఇంక మేము ఎందుకు" అంటూ శివాజీ గేమ్ ఆడకుండా వెళ్ళిపోయాడు. ఈ విషయంలో శోభ, శివాజీ ఇద్దరి మధ్య పెద్ద ఆర్గుమెంట్ జరిగింది.

publive-image

నా ఇష్టం.. నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తా

పదే పదే ప్రియాంక అనడం ఎందుకు అని శివాజీ శోభ పై కోప్పడ్డాడు. దానికి శోభ అది "నా ఇష్టం.. నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తాను" అంటూ శివాజీతో వాదించింది. ఇక శివాజీ.. "ఈ ఆటలో నువ్వు సంచాలక్.. అందరికీ సపోర్ట్ చేయాలి" అని మాట్లాడాడు. దానికి శోభ.. "నాకు ప్రియాంకకు సపోర్ట్ చేయాలనీ ఉంది.. అందుకే చేశా.. అది నా ఇష్టం" అని చెప్పింది. "ఈ పది నిమిషాల్లో ఎన్ని మార్చావో చూసుకో" అని చెప్పాడు శివాజీ. వీరిద్దరి మధ్య వాదన పెరింది. శోభ.. "వెళ్లి కూర్చోని వాటర్ తాగండి సార్.. ఇద్దరం అరిచాము కదా కాస్త కామ్ అవుతామని" వెటకారం చేసింది. ఇక శివాజీ ఈ తగ్గించుకో శోభ అని చెప్పాడు. "మీలా అయితే నటించట్లేదు సార్ 80 కెమెరాస్ ముందు.. వామ్మో" అంటూ శివాజితో వాదించింది.

publive-image

Also Read: Bigg Boss 7: “నేను ఉంటే ఎంత.. పోతే ఎంత”.. వీడి డబుల్ గేమ్ అందరికీ తెలియాలి..!

#bigg-boss-7-telugu #bigg-boss-7 #bigg-boss-7-telugu-latest-updates #bigg-boss-7-promo
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe