/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-35-1-jpg.webp)
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నిన్న జరిగిన ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ లో ప్రియాంక, అర్జున్, అశ్విని, ప్రశాంత్, భోలే, సందీప్ కెప్టెన్సీ కంటెండర్స్ గా ఎంపిక అయ్యారు. ఈ వారం జరిగిన గులాబీపురం, జిలేబీపురం టాస్క్ లో.. శివాజీ రెండు ఊళ్ళ పెద్ద మనిషిగా ఉన్నందున శివాజీకి నేరుగా కంటెండర్ అయ్యే అవకాశం ఉందని బిగ్ బాస్ పేర్కొన్నాడు. కానీ ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే.. శివాజీ (Sivaji) కంటెండర్ అవ్వాలంటే ఇప్పటికే కంటెండర్లు గా ఉన్న ప్రశాంత్ (Pallavi Prashanth), భోలే, ప్రియాంక, సందీప్,అర్జున్, అశ్విని ఈ ఆరుగురు నుంచి ఒకరు రేసు నుండి తప్పుకోవాల్సి ఉంటుందని తెలిపాడు బిగ్ బాస్.
కెప్టెన్సీ టాస్క్
బిగ్ బాస్ ఆరుగురు నుంచి ఒకరు తప్పుకోవాలి అనగానే భోలే (Bhole).. నేను ఆడను నా ప్లేస్ లో శివాజీ ఆడతాడు అని శివాజీ కోసం భోలే రేసు నుంచి తప్పుకున్నాడు. జిలేబిపురం నుంచి కెప్టెన్సీ కంటెండర్లు గా ఎంపికైన ఈ ఆరుగురి సభ్యులలో ఎవరు కెప్టెన్ అవ్వాలి అనేది, గులాబీపురం సభ్యులు నిర్ణయిస్తారని బిగ్ బాస్ తెలిపారు. ఇక్కడ వీళ్ళకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లివింగ్ ఏరియాలో టేబుల్ పై ఉన్న చైన్ ఎవరు ముందుగా పట్టుకుంటారో వాళ్ళు వెళ్లి ఆ ఆరుగురు సభ్యుల్లో కెప్టెన్సీ కి అనర్హులు అని భావించిన వారి ఫోటోను స్విమ్మింగ్ పూల్ వేసి వారిని రేసు నుంచి తొలగించాల్సి ఉంటుందని చెప్పాడు బిగ్ బాస్ (Bigg Boss).
రేసు నుంచి ఔట్ అయిన సభ్యులు
ప్రియాంక, ప్రశాంత్, అశ్విని, శివాజీ వీళ్ళ ముగ్గురిని యావర్, పూజ, శోభ, అమర్, పలు కారణాలు చెప్పి రేసు నుంచి తొలగించారు. ఇక యావర్ చెప్పిన రీజన్ నచ్చని, ప్రియాంక యావర్ తో ఆర్గుమెంట్ చేసింది. ఆ తర్వాత ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఇక చివరికి మిగిలిన అర్జున్, సందీప్ ఇద్దరి మధ్య ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ ఉండబోతున్నట్లు బిగ్ బాస్ తెలిపారు.
కన్ఫెషన్ రూమ్ లో శివాజీ
చెయ్యి నొప్పితో బాధపడుతున్న శివాజీని బిగ్ బాస్ పిలిచి శివాజీ మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగారు. దాంతో శివాజీ 'చాలా ఇబ్బందింగా ఉంది బిగ్ బాస్.. నా వల్ల కావటం లేదు, అందరి ముందు ఏడవలేక.. నవ్వుతూ ఉంటున్నాను అంటూ శివాజీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. 'నేను ఇక్కడికి కప్పు కొడదామనే వచ్చా, నాకు ఆ తెలివి ఉంది కానీ నా ఆరోగ్యం సహకరించడం లేదు అంటూ బిగ్ బాస్ తో శివాజీ బాధపడ్డాడు.
Also Read: Venu Yeldandi: గుడ్ న్యూస్ చెప్పిన వేణు.. ఫొటోలు వైరల్..!