Bigg Boss 7 Telugu: ఆట మొదలైంది.. ఫస్ట్ ఎపిసోడ్‌లోనే దిమ్మతిరిగే ట్విస్టులు.. హైప్ క్రియేట్ చేస్తోన్న ప్రోమో..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్లకు సర్‌ప్రెస్ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. నవీన్ స్పెషల్ ఎంట్రీతో కంటెస్టెంట్లను అలరించాడు. నవీన్‌ను చూసి కంటెస్టెంట్లు థ్రిల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను కూడా స్టార్ మా విడుదల చేసింది.

New Update
Bigg Boss 7 Telugu: ఆట మొదలైంది.. ఫస్ట్ ఎపిసోడ్‌లోనే దిమ్మతిరిగే ట్విస్టులు.. హైప్ క్రియేట్ చేస్తోన్న ప్రోమో..

Bigg Boss 7 Telugu: 'ఉల్టా పల్టా' ట్యాగ్‌తో స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 7.. తొలి ఎపిసోడ్‌లోనే సరికొత్త హైప్ క్రియేట్ చేస్తుంది. తాజాగా స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమో(Bigg Boss Promo) చూస్తుంటే.. భారీ ట్విస్టులు ఉండనున్నట్లు తెలుస్తోంది. స్టార్ మా రిలీజ్ చేసిన ఈ ప్రోమో అభిమానుల్లో మరింత ఉత్కంఠను రేపుతోంది. ఎపిసోడ్ మొదట్లోనే.. బిగ్ బాస్(Bigg Boss) వారికి ఊహించని టాస్క్ ఇచ్చాడు. ఇప్పుడుది మరింత ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ ప్రోమోలో కంటెస్టెంట్లకు బిగ్ బాస్ టాస్క్ ఇస్తూ.. 'మీ మొదటి నామినేషన్ చేసే సమయం ఆసన్నమైంది. ఏ ఇద్దరు కంటెస్టెంట్స్ అనర్హులని మీరు భావిస్తున్నారు. వారి ఫోటోలను తీసుకుని చించేయాలి.' అంటూ కంటెస్టెంట్‌లను ఇరకాటంలో పడేసే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.

ఈ ప్రోమోను షేర్ చేసిన స్టార్ మా.. 'యుద్ధ భూమి సిద్ధమైంది. కంటెస్టెంట్స్ ఇప్పుడు నామినేషన్ల పోరులో చిక్కుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో ఇదొక భారీ గేమ్' అంటూ ట్వీట్‌ చేసింది. ఇప్పుడు సరికొత్త హైప్ క్రియేట్ చేస్తుంది. తొలి ఎపిసోడ్‌లో పరిస్థితి ఎలా ఉండబోతోందనని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

డేంజర్ జోన్‌లో ఉన్నది వీరే..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 మొదటి వారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. డేంజర్‌ జోన్‌లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ ప్రో ప్రకారం.. ఎలిమినేషన్ రేసులో గౌతమ్ కృష్ణ, రాతిక, షకీలా, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, కిరణ్ రాథోడ్, ప్రిన్స్ యావర్, ధామిన భట్ల ఉన్నారు.

సర్‌ప్రైజ్ ఇవ్వనున్న నవీన్ పోలిశెట్టి..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్లకు సర్‌ప్రెస్ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. నవీన్ స్పెషల్ ఎంట్రీతో కంటెస్టెంట్లను అలరించాడు. నవీన్‌ను చూసి కంటెస్టెంట్లు థ్రిల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను కూడా స్టార్ మా విడుదల చేసింది.

Also Read:

Bigg Boss 7 : బిగ్‌బాస్ హౌస్‌లోకి ఊహించని సెలబ్రిటీ.. సెకండ్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

Kushi Movie Records: ఖుషి కలెక్షన్ల వర్షం.. డే 2 ఎంత వసూలు చేసిందంటే..

Advertisment
తాజా కథనాలు