Bigg Boss 7 Telugu Promo: నాన్న ఏడవకు.. నువ్వు ఏడిస్తే ఇంట్లో అందరు ఏడుస్తారు..!

బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో సభ్యులు ఎంతగానో ఎదురుచూసే ఫ్యామిలీ వీక్ ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమోలో శివాజీ కొడుకును డాక్టర్ గెటప్ లో ఇంట్లోకి పంపి శివాజీని సార్ ప్రైజ్ చేశారు బిగ్ బాస్.

New Update
Bigg Boss 7 Telugu Promo: నాన్న ఏడవకు.. నువ్వు ఏడిస్తే ఇంట్లో అందరు ఏడుస్తారు..!

Shivaji Son into Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ హౌస్ లో 15 వారాల పాటు ఫ్యామిలీస్ కి దూరంగా.. కనీసం ఫోన్ లో మాట్లాడే అవకాశం కూడా ఉండదు. కొన్ని సార్లు కంటెస్టెంట్స్ ఫ్యామిలీ గుర్తొస్తుందని ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ కోసం ఇంటి సభ్యులతో పాటు కంటెస్టెంట్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తారు.

publive-image

ఇక ఈరోజు అందరు ఎంతగానో వెయిట్ చేసే ఫ్యామిలీ వీక్ ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమోలో మొదటగా బిగ్ బాస్ ఇంట్లోకి శివాజీ కొడుకు వచ్చాడు. శివాజీ కొడుకును డాక్టర్ గెటప్ లో ఇంట్లోకి పంపించి శివాజీని సర్ ప్రైజ్ చేశారు బిగ్ బాస్.

publive-image

హెల్త్ చెకప్ కోసమని శివాజీని మెడికల్ రూమ్ కి పిలిచారు. హెల్త్ చెకప్ కోసం వెళ్లిన శివాజీని.. మీ చెయ్యి ఎలా ఉంది .. టైం కి మందులు వేసుకుంటున్నారా.. వ్యాయామాలు చేస్తున్నారా అని ప్రశ్నించగా .. దానికి శివాజీ ఫీలింగ్ బెటర్ అని తెలిపారు. ఆ తర్వాత భుజానికి సంబంధించిన ప్రశ్నలు అడిగి .. ఇంకో మూడు రోజుల్లో మీ ఆరోగ్యం సెట్ అవుతుందని చెప్పగా.. నేను అదే కోరుకుంటున్నాని చెప్పి శివాజీ వెళ్లిపోతుండగా అక్కడ డాక్టర్ గెటప్ లో ఉన్న శివాజీ కొడుకు ఫేస్ మాస్క్ తీసి శివాజీని సర్ ప్రైజ్ చేశాడు.

Shivaji Son into Bigg Boss

కొడుకును చూసిన ఆనందంలో శివాజీ (Shivaji) తనను పట్టుకొని ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి అందరికి పరిచయం చేశాడు. ఇక శివాజీ కొడుకుతో మాట్లాడుతూ.. నువ్వు రావు.. తమ్ముడు వస్తాడేమో అనుకున్నాను.. నీకు సిగ్గు కదా అంటూ నవ్వాడు. 'నాకు 8వ తేదీన యూనివర్సిటీ కి వెళ్తున్నాను.. నువ్వు వచ్చేసరికి మళ్ళీ కలిసే ఛాన్స్ ఉండదు.. అందుకే నిన్ను చూడడానికి వచ్చానని ఎమోషనల్ అయ్యాడు. దాంతో శివాజీ కన్నీళ్లు పెట్టుకోవడంతో.. నాన్న నువ్వు ఏడవకు .. నువ్వు ఏడిస్తే ఇంట్లో అందరు ఏడుస్తారు అని ఎమోషనల్ అయ్యాడు శివాజీ కొడుకు.

Shivaji Son into Bigg Boss

Also Read: Bigg Boss 7 Telugu - ‘‘నేను తొక్కేస్తున్నాడని చెప్పలేదు’’.. మాట మార్చకండి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు