Bigg Boss 7 Telugu: మీ ఇద్దరి కోసమే నేను ఇంట్లో ఉన్నాను.. శివాజీ మాటలు వింటే షాక్..?

బిగ్ బాస్ సీజన్ 7 నిన్న జరిగిన ఎపిసోడ్ లో గులాబీపురం, జిలేబీపురం టీమ్స్ గా విడిపోయిన ఇంటి సభ్యులు కెప్టెన్సీ టాస్క్ మొదటి లెవెల్ పాల్గొనగా ఆ టాస్క్ లో జిలేబీపురం సభ్యులైన అర్జున్, అశ్విని, ప్రశాంత్, సందీప్ గెలిచారు. టాస్క్ పూర్తయ్యాక శివాజీ చెప్పిన మాటలకు శోభ కాస్త హర్ట్ అయ్యాను అంటూ శివాజీ తో బాధపడింది. అసలు శివాజీ ఏమన్నారంటే..

Bigg Boss 7 Telugu: మీ ఇద్దరి కోసమే నేను ఇంట్లో ఉన్నాను.. శివాజీ మాటలు వింటే షాక్..?
New Update

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ (Captaincy Task) మొదటి లెవెల్ పూర్తయింది. ఈ టాస్క్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులను రెండు టీమ్స్ గా డివైడ్ చేశారు. గులాబీపురం గ్రామానికి చెందిన సభ్యులు ఒక టీం, జిలేబీపురం గ్రామానికి చెందిన సభ్యులు ఒక టీమ్.

కెప్టెన్సీ టాస్క్ ఫస్ట్ లెవెల్ 

మొదటి లెవెల్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ .. గుడ్లను సురక్షితమైన గూడుకు ఏ టీమ్ సభ్యులు ముందుగా చేరిస్తే, వాళ్ళు గెలుస్తారని చెప్పాడు. ఇక టాస్క్ లో ఒక్క టీమ్ నుంచి నలుగురు సభ్యులు  పాల్గొనాల్సి ఉంటుంది. జిలేబీపురం నుంచి అశ్విని (Ashwini), ప్రశాంత్ (Pallavi Prashanth) , అర్జున్, సందీప్ గులాబీపురం నుంచి గౌతమ్, అమర్,యావర్, శోభా. ఈ నలుగురు ఒకరి నుంచి ఒకరు ఆ గుడ్డును పాస్ చేస్తూ అవి పగలకుండా వాటిని గూడుకు చేర్చాల్సి ఉంటుంది. ఇక ఈ టాస్క్ లో ఒక్క గుడ్డు తేడాతో  జిలేబీపురం టీమ్ విన్ అయ్యారు. దాంతో శోభ..నేనే  ఒక్క గుడ్డు మిస్ చేశాను.. నా వల్లనే టాస్క్ పోయింది అంటూ ఏడ్చేసింది.

publive-image

శివాజీ మాటలకు హర్ట్ అయిన శోభ

టాస్క్ పూర్తయిన తర్వాత శివాజీ (Shivaji).. అమర్ (Amar), సందీప్ తో మాట్లాడుతూ ప్రశాంత్ ఉన్న టీమ్ ఇప్పటివరకు ఎప్పుడు  ఓడిపోలేదు అని అంటాడు. అది కాస్త అమర్ వెళ్లి టాస్క్ లో ఓడిపోయి భాదపడుతున్న శోభతో చెప్పగానే శోభ వెళ్లి.. శివాజీ అన్న మీరు అలా అనడం నాకు నచ్చలేదు, నేను హర్ట్ అయ్యాను. మీకు ప్రశాంత్ ఇష్టమైతే అది మీ ఇష్టం అంతే కానీ ప్రశాంత్ ఉన్న టీమ్ ఎప్పుడు ఓడిపోలేదు అంటే అవతలి వాళ్లకు బాధనిపిస్తుంది. మేము కూడా కష్టపడి ఆడాము అంటూ శివాజీతో బాధపడింది.

మీ ఇద్దరి కోసమే నేను ఇంట్లో ఉన్నాను

ఇళ్ళు గుర్తుకొస్తుంది అని భాదపడుతున్న శివాజీని, యావర్ (Yawar) ఓదారుస్తూ ఉంటాడు.. అప్పుడు శివాజీ అసలు నేను ఈ ఇంట్లో ఉంటుంది, మీ ఇద్దరి(ప్రశాంత్, యావర్) కోసమే లేదంటే నేను నాగార్జునను అడిగి ఎప్పుడో వెళ్లిపోయేవాడిని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు శివాజీ.

Also Read: Bigg Boss 7 Telugu Promo: గులాబీపురం VS జిలేబీపురం.. రెండు ఊళ్ళ మధ్య పోటీ..!

#bigg-boss-7-telugu #bigg-boss-7 #bigg-boss-7-telugu-latest-updates #bigg-boss-7-latest-episode #bigg-boss-7-actor-sivaji
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe