Bigg Boss 7 Promo: నువ్వు పిచ్చోడివే .. మళ్ళీ మళ్ళీ అంటాను.. ఏం చేస్తావు..!

బిగ్ బాస్ సీజన్ 7లో ఈ రోజు ప్రోమో విడుదలైంది. కెప్టెన్సీ కోసం పోటీపడుతున్న శోభ, ప్రశాంత్, ప్రియాంక, సందీప్, గౌతమ్ వీళ్ళ ఐదుగురికి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ 'ఈ మిర్చీ చాలా హాట్'. ఇక ఈ టాస్క్ లో యావర్, శోభ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగినట్లు ప్రోమోలో కనిపించింది.

New Update
Bigg Boss 7 Promo: నువ్వు పిచ్చోడివే .. మళ్ళీ మళ్ళీ అంటాను.. ఏం చేస్తావు..!

Bigg Boss 7 Promo: బిగ్ బాస్ సీజన్ 7 బిగ్ బాస్ 'మారథాన్ లో' భాగంగా వివిధ టాస్కుల్లో పాల్గొని శోభ, ప్రశాంత్, ప్రియాంక, గౌతమ్, సందీప్ ఐదుగురు కెప్టెన్సీ పోటీదారులుగా  ఎంపికయ్యారు. ఇక ఈ రోజు విడుదలైన ప్రోమోలో వీళ్ళ ఐదుగురిలో కెప్టెన్ అయ్యేది ఎవరూ అనేది డిసైడ్ చేయాల్సింది ఇంటి సభ్యులే అని బిగ్ బాస్ తెలిపారు. బిగ్ బాస్ వీళ్లకు ఇచ్చిన టాస్క్ 'ఈ మిర్చీ చాలా హాట్'. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులు కూడా మిర్చీ లాగే చాలా ఫైర్ మీద ఉన్నట్లు కనిపించారు.

ఈ మిర్చీ చాలా హాట్
ఈ టాస్క్ లో భాగంగా  మిర్చీ దండలను ఏర్పాటు చేశారు బిగ్ బాస్.  పోటీదారులుగా ఎంపికైన శోభ, ప్రశాంత్, గౌతమ్, సందీప్, ప్రియాంక  ఐదుగురిలో కెప్టెన్ గా అర్హత లేదని భావించిన వారి మెడలో మిగతా ఇంటి సభ్యులు మిర్చీ దండను వేయాలని బిగ్ బాస్ తెలిపారు.

నువ్వు పిచ్చోడివే..

ఈ టాస్క్ లో యావర్ (Prince Yawar), శోభ (Shobha) ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగినట్లు కనిపిస్తుంది ప్రోమోలో. యావర్.. శోభను కెప్టెన్ గా అనర్హురాలిగా ప్రకటించి తన మెడలో దండ వేశాడు. దీంతో  శోభ, యావర్ మధ్య పెద్ద గొడవ జరిగింది. యావర్ చెప్పిన రీజన్ నచ్చని శోభ.. నీలాంటి బక్వాస్ రీజన్ నేను చెప్పను.. అంటూ యావర్ పై అరిచేసింది. వీళ్లిద్దరి మధ్య జరిగిన  గొడవలో శోభ.. యావర్ నువ్వు పిచ్చోడివే అంటూ ఆరోపణలు చేసింది.  ఆ మాటకు యావర్ నన్ను పిచ్చోడా అంటావా.. అని శోభ పై ఫైర్ అయ్యాడు. అయినా సరే శోభ మాత్రం అస్సలు ఊరుకోలేదు.. పిచ్చోడా అని మళ్ళీ మళ్ళీ అంటాను, ఏం చేస్తావు అని యావర్ ను రెచ్చగొట్టింది.

Bigg Boss 7 Promo

ఆ తర్వాత వచ్చిన రతిక (Rathika) కూడా శోభ మెడలోనే దండ వేసి అనర్హురాలిగా ప్రకటించింది. దానికి రతిక చెప్పిన కారణం.. నువ్వు త్వరగా కోపం తెచ్చుకుంటావు, ఇతరులను అర్థం చేసుకోకుండా అరిచేస్తావు అది కెప్టెన్ కి ఉండాల్సిన లక్షణం కాదని  చెప్పింది. దీంతో శోభ అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు.. సమస్య ఉన్న వాళ్ళు చెప్తారులే అని పొగరుగా సమాధానం ఇచ్చింది. దానికి రతిక ఇదే మార్చుకుంటే మంచిది అని శోభకు కౌంటర్ ఇచ్చింది.

Bigg Boss 7 Promo

పోటీదారులలో ఉన్న సభ్యుల్లో అందరూ నామినేషన్స్ లో ఉన్నారు ఒక్క ప్రశాంత్ (Pallavi Prashanth) తప్పా. అందుకే నేను ప్రశాంత్ ను రేసు నుంచి తొలగిస్తున్నాని చెప్పాడు అమర్. దానికి ప్రశాంత్  నేను తప్పుకుంటే వాళ్ళు సేవ్ అవుతారా అంటూ అమర్ తో వాదించాడు. ఆ తర్వాత వచ్చిన భోలే ప్రియాంక మెడలో దండ వేసి రేసు నుంచి తప్పించాడు. వీళ్లిద్దరి మధ్య కూడా హీటెడ్ ఆర్గుమెంట్ జరిగినట్లు ప్రోమోలో కనిపించింది.

ఇక ఈరోజు జరగబోయే కెప్టెన్సీ టాస్క్ లో యావర్, శోభ  రతిక, శోభ  మధ్య గట్టిగానే గొడవ జరిగినట్లు కనిపించింది ప్రోమోలో. ఇన్ని గొడవల మధ్యలో కెప్టెన్ అయ్యేది ఎవరోనని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.

Also Read: ప్రశాంత్ తో రతిక ప్యాచప్.. ఆ మాటలకు ఏడ్చేసిన ప్రశాంత్..!

Advertisment
తాజా కథనాలు