Bigg Boss 7 Telugu: అర్జున్ ఫస్ట్ ఫైనలిస్ట్ .. పాపం అమర్.. మళ్ళీ నిరాశే మిగిలింది..!

బిగ్ బాస్ సీజన్ 7.. నిన్నటి ఎపిసోడ్ లో టికెట్ టూ ఫినాలే రేసు లో టాప్ 2 లో ఉన్న అమర్, అర్జున్ ఫైనల్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఈ ఫైనల్ ఛాలెంజ్ లో గెలిచిన అర్జున్ టికెట్ టూ ఫినాలే సొంతం చేసుకొని.. బిగ్ బాస్ సీజన్ 7 మొదటి ఫైనలిస్ట్ గా నిలిచాడు.

Bigg Boss 7 Telugu:  అర్జున్ ఫస్ట్ ఫైనలిస్ట్ .. పాపం అమర్.. మళ్ళీ నిరాశే మిగిలింది..!
New Update

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 .. బిగ్ బాస్ హౌస్ లో ఇంటి సభ్యులంతా ఈ వారం టికెట్ టూ ఫినాలే కోసం పోటీ పడ్డారు. టికెట్ టూ ఫినాలే టాస్క్ చాలా ఆసక్తిగా సాగింది. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులంతా పలు ఛాలెంజెస్ లో పాల్గొన్నారు. ప్రతీ లెవెల్ లో స్కోర్ బోర్డు పై తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు ఈ రేసు నుంచి తొలగిపోయారు. టికెట్ టూ ఫినాలే టాస్క్ చివరి లెవెల్ కు చేరుకున్న సభ్యులు ప్రశాంత్, అర్జున్, అమర్. ఇక యావర్, గౌతమ్, ప్రియాంక, శోభ, శివాజీ తక్కువ స్కోర్ ఉన్నందున రేసు నుంచి తొలగిపోయిన విషయం తెలిసిందే.

publive-image

నిన్నటి ఎపిసోడ్ చివరి లెవెల్ కు చేరుకున్న అర్జున్, ప్రశాంత్, అమర్ నెక్స్ట్ లెవెల్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఈ ఛాలెంజ్ లో అర్జున్ టాస్క్ ముందుగా పూర్తి చేశాడు. ఆ తర్వాత ప్రశాంత్, అమర్ పూర్తి చేశారు. ఈ టాస్క్ ప్రశాంత్ ముందుగా పూర్తి చేశాడు కానీ తొందరపాటు వల్ల ఫస్ట్ ప్లేస్ మిస్ అయ్యాడు.

అర్జున్ స్ట్రాటజీ సూపర్

ఆ తర్వాత టికెట్ టూ ఫినాలే రేసులో టాప్ 3 ఉన్న ప్రశాంత్, అర్జున్, అమర్ కు మరో ఛాలెంజ్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ ఛాలెంజ్ ఎవరు ఎక్కువ జెండాలను కలెక్ట్ చేస్తే వాళ్ళు స్కోర్ పెరుగుతుందని లీస్ట్ లో ఉన్న వారికి జీరో పాయింట్స్ అని తెలిపారు. ఈ టాస్క్ లో ముందుగా అర్జున్ (Arjun Ambati) తన ఎక్కువ జెండాలను కలెక్ట్ చేశాడు. ఆ తర్వాత తన బలాన్ని ఉపయోగించి ప్రశాంత్, అమర్ కదలకుండా ఆపే ప్రయత్నం చేశాడు. అమర్ రెండు జెండాలు, ప్రశాంత్ కేవలం ఒక జెండా మాత్రమే కలెక్ట్ చేశాడు. దీంతో అర్జున్ స్కోర్ బోర్డు లో ప్రశాంత్ (Pallavi Prashanth) కంటే ముందుకు వెళ్ళాడు. ప్రశాంత్ రేసు నుంచి ఔట్ అయ్యాడు.

publive-image

ఫస్ట్ ఫైనలిస్ట్ గా అర్జున్

ఇక చివరి ఛాలెంజ్ లో అమర్ (Amar), అర్జున్ ఇద్దరు టికెట్ టూ ఫినాలే కోసం పోటీ పడ్డారు. ఈ ఛాలెంజ్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ పాముతో చెలగాటం. ఈ టాస్క్ లో ముందుగా అమర్ విన్ అవుతాడు అని అందరు అనుకున్నారు. కానీ అర్జున్ చివరిలో తన వేగం, స్ట్రాటజీతో టాస్క్ త్వరగా పూర్తి చేసి టికెట్ టూ ఫినాలే సొంతం చేసుకున్నాడు.

publive-image

Also Read: Bigg Boss 7 Telugu: తొందర పడిన ప్రశాంత్.. ఫినాలే రేసులో దూసుకెళ్తున్న అమర్.. !

#bigg-boss #bigg-boss-7-telugu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe