Bigg Boss 7 Telugu: నాకు ముష్టి వేస్తున్నారా.. నేను అడుక్కోవాలా.. అది కరెక్ట్ కాదు సార్!

బిగ్ బాస్ సీజన్ 7.. నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున.. కెప్టెన్సీ టాస్క్ లో అమర్, శివాజీ ఇద్దరి మధ్య జరిగిన వాదనల పై ఇంటి సభ్యులకు క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ వారం హౌస్ మేట్స్ చేసిన మిస్టేక్స్ గురించి మాట్లాడి అందరికీ గట్టిగానే క్లాస్ ఇచ్చారు.

Bigg Boss 7 Telugu:  నాకు ముష్టి వేస్తున్నారా.. నేను అడుక్కోవాలా.. అది కరెక్ట్ కాదు సార్!
New Update

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ఇంటి సభ్యుల తప్పుల గురించి మాట్లాడుతూ హౌస్ మేట్స్ అందరికి గట్టిగానే క్లాస్ ఇచ్చారు. అలాగే ఇంటి సభ్యుల మధ్య జరుగుతున్న వాదనలో ఎవరి రైట్ ఎవరు తప్పు అనే విషయం పై కూడా అందరికీ ఒక క్లారిటీ ఇచ్చారు.

అప్పుడు  అమర్ నిజామా.. ఇప్పుడు అమర్ నిజామా

నాగార్జున మాట్లాడుతూ.. అమర్ (Amar) ఈ వారం నీ ఆరోగ్యం బాగా లేకపోయినా టాస్క్ చాలా బాగా ఆడావు, ఎంటర్ టైం కూడా చేశావు అని ప్రశంశించారు. ఆ తర్వాత అమర్ నాకు.. నీతో చిన్న సమస్య ఉంది అని.. రెండో వారం నామినేషన్ ప్రక్రియలో అమర్ ప్రశాంత్ పై చేసిన ఆరోపణల వీడియోను చూపించారు. ఆ వీడియోలో అమర్.. ప్రశాంత్ ఏడుపును యాక్టింగ్, సింపతీ కోసం అని అన్నాడు.

publive-image

ఈ విషయం గురించి నాగార్జున మాట్లాడుతూ.. అమర్ నీకు కెప్టెన్సీ రాలేదని నువ్వు కూడా బాధపడ్డావు, ఏడ్చావు కదా.. మరీ అది కూడా సింపతీ కోసమేనా లేదా నిజమేన అని అడిగారు. పరిస్థితి నా వరకు వస్తే కానీ అర్థం కాలేదు.. చివరి వరకు వచ్చి కెప్టెన్ అవ్వలేదనే బాధతోనే ఏడ్చాను తప్పా యాక్టింగ్ కాదు సార్ అని క్లారిటీ ఇచ్చాడు. ఇక నాగార్జున మరీ అప్పుడు అమర్ నిజామా.. ఇప్పుడు అమర్ నిజామా.. మేము ఎవరిని నమ్మాలి అని ప్రశ్నించారు. నేను ఎప్పుడు ఒకేలా ఉంటాను.. నా అనుకున్న వాళ్ళు మోసం చేసే సరికి కొంచం భాదపడ్డాను సార్ అని చెప్పాడు.

publive-image

శివాజీ ఎందుకు మాట నిలబెట్టుకోలేదు

ఆ తర్వాత నాగార్జున.. ఎవరిని నమ్మావు అమర్ అని అడగగా.. శివాజీ (Shivaji) అన్నను నమ్మాను అని చెప్పాడు. శివాజీ అమర్ కు కెప్టెన్ చేస్తానని మాట ఇచ్చావు.. మరి ఎందుకు నిలబెట్టుకోలేదని అడిగారు. ఇక శివాజీ డెప్యూటీ విషయంలో అమర్ నిర్ణయం నాకు నచ్చలేదు అందుకే నేను సపోర్ట్ చేయలేదని చెప్పాడు. ఈ విషయంలో అమర్, శివాజీ ఇద్దరి మధ్య కాసేపు వాదన జరిగింది. శివాజీ.. అమర్ ను "నువ్వు చాలా గొప్ప నటుడివి" అనగా.. అమర్ "నీ కంటే కాదులే" అని కౌంటర్ ఇచ్చాడు.

publive-image

ముష్టి వేస్తున్నారా.. నేను అడుక్కోవాలా

కెప్టెన్సీ గురించి అమర్ మాట్లాడుతూ.. నన్ను అనర్హుడు అని చెప్పడం నాకు నచ్చలేదు.. అది నేను తీసుకోలేకపోయాను. అంతే కాదు వెళ్లి శివాజీ అన్నను అడుక్కో అన్నారు. ఇక్కడేమైనా ముష్టి వేస్తున్నారా.. నేను అడుక్కోవాలా.. ఇది డిజర్వ్, అన్ డిజర్వ్ టాస్క్ అడుక్కునే టాస్క్ కాదు కదా సార్ అని బాధపడ్డాడు.

publive-image

Also Read: Bigg Boss 7 Telugu: “ఎవరి పొరపాట్లకు వాళ్ళే బలవుతారు”.. అశ్వినికి డబుల్ ఎలిమినేషన్ షాక్..!

#bigg-boss-7-telugu #bigg-boss-7-latest-episode #bigg-boss-7
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe