Bigg Boss 7 Telugu TRP Rating: ఏ మాత్రం తగ్గని బిగ్‌బాస్‌ క్రేజ్‌..వామ్మో ఇంత మంది చూస్తున్నారా..?

బిగ్‌బాస్‌ 7 క్రేజ్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. ‘ఉల్టా పుల్టా’ సీజన్‌ బాగా కలిసిసొచ్చినట్లుంది. గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్‌ మరింతగా దూసుకుపోతుందనీ, ప్రేక్షకుల ఆదరణ రెట్టింపు అయిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. దాదాపు 5.1 కోట్ల మంది ప్రేక్షకులు మొదటి వారం ‘బిగ్‌ బాస్‌’ షో చూసినట్లు తెలుస్తోంది.

New Update
Bigg Boss 7 Telugu TRP Rating: ఏ మాత్రం తగ్గని బిగ్‌బాస్‌ క్రేజ్‌..వామ్మో ఇంత మంది చూస్తున్నారా..?

Bigg Boss 7 Telugu Record TRP Rating: బిగ్‌బాస్‌ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. ‘ఉల్టా పుల్టా’ సీజన్‌ బాగా కలిసిసొచ్చినట్లుంది. గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్‌ మరింతగా దూసుకుపోతుందనీ, ప్రేక్షకుల ఆదరణ రెట్టింపు అయిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. దాదాపు 5.1 కోట్ల మంది ప్రేక్షకులు మొదటి వారం ‘బిగ్‌ బాస్‌’ షో చూశారని తెలుస్తోంది.

‘బిగ్‌ బాస్‌ సీజన్‌ 7’ ఎన్నో సంచలనాలకు వేదికైందని రేటింగ్స్‌ పరంగా, వ్యూయర్‌షిప్‌ పరంగా ఊహించని అద్భుతాలకు దారి తీసిందని నిర్వాహకులు పేర్కొన్నారు. సీజన్‌ సీజన్‌కి పెరుగుతున్న ఆదరణ ఈ సీజన్‌కి వచ్చేసరికి ఎన్నో రెట్లు పెరిగి తెలుగు టెలివిజన్‌ చరిత్రలోనే సరికొత్త ప్రమాణాలను సృష్టించిందని ‘స్టార్‌ మా’ (Star Maa) తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు ఇప్పుడు ఈ షో చూస్తున్నారనీ  షో నిర్వాహకులు తెలిపారు.

‘బిగ్‌ బాస్‌ సీజన్‌ 7’ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సుమారు 3 కోట్ల మంది ప్రేక్షకులు చూడడంతో గతంలో క్రికెట్‌ మ్యాచ్‌ల వీక్షణ పరంగా నమోదైన రికార్డులను కూడా తెలుగులో ప్రసారం అవుతున్న ‘బిగ్‌ బాస్‌ సీజన్‌ 7’ అధిగమించటం విశేషం అని తెలిపారు. గత సీజన్‌లో సాధించిన రేటింగ్‌ తో పోలిస్తే 40 శాతం అధిక రేటింగ్‌ తీసుకొచ్చిందని పేర్కొన్నారు. తిరుగులేని ఈ ప్రేక్షక ఆదరణతో ఇప్పటికే నెంబర్‌ వన్‌ స్థానంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న స్టార్‌ మా... నెంబర్‌ 1 ఛానల్‌గా తనస్థ్థానాన్ని మరోమారు నిలబెట్టుకుందని ‘బిగ్‌ బాస్‌ సీజన్‌ 7’ సాక్షిగా వెల్లడించింది. ఈ సీజన్‌ ఉల్టా పల్టాగా ఉండబోతోంది అని కింగ్‌ నాగార్జున (King Nagarjuna) ప్రోమోలో చెప్పిన నాటి నుంచి విపరీతమైన అంచనాలు పెరిగాయి. ‘బిగ్‌ బాస్‌ సీజన్‌ 7’ వీకెండ్‌ ఎపిసోడ్‌ను సరాసరిన 7.1 రేటింగ్‌తో చూస్తే , మెట్రో నగరమైన హైదరాబాద్‌ లో అత్యధికంగా 8.7 రేటింగ్‌ తో వీక్షించడం విశేషం.

బిగ్‌బాస్ వంటి రియాలిటీ షో తెలుగులో హిట్ అవుతుందా ..? అనే అనుమానం మొదట్లో అందరికి కలిగింది. కాని మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో..వెనుతిరిగి చూసుకునే అవకాశం లేకపోయింది. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన రావడంతో తరువాత సీజన్‌లపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తెలుగు బిగ్‌బాస్ మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ (NTR).. హోస్ట్‌గా చేయగా.. రెండో సీజన్‌కు హీరో నాని (Hero Nani) వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక మూడో సీజన్‌ నుంచి కింగ్ నాగార్జుననే బిగ్‌బాస్ హోస్ట్‌గా కొనసాగుతున్నారు.

Also Read: గేమ్ మొత్తం చేంజ్ చేసి ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు