/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/nag-jpg.webp)
Bigg Boss 7 Promo: బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో(Concept) ఆసక్తిగా ప్రారంభించారు. శనివారం వచ్చే వీకెండ్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు, ఇంటి సభ్యులకు ఆసక్తిగా ఎదురుచూస్తారు. నాగార్జున(Nagarjuna) ఏం మాట్లాడతాడు, ఎవరు ఎలిమినెట్ అవుతారని ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. సీజన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే నెల రోజులకు పైగా అవుతుంది. బిగ్ బాస్ షోను చాలా ఇంట్రెస్టింగ్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. హౌస్ మేట్స్ కి ఎప్పటికప్పుడు అంచనాలకు అందకుండా షాకులు ఇస్తూనే ఉన్నాడు. వారం మొత్తం, గొడవలు, టాస్క్ లతో కొట్టుకునే ఇంటి సభ్యులకు వీకెండ్(weekend) రాగానే టెన్షన్ స్టార్ అవుతుంది. వీకెండ్ లో నాగార్జున రివ్యూ కోసం ఎదురుచూస్తారు. ఇక ఈ వీకెండ్ ప్రోమో అదిరిపోయింది.. జంటలుగా విడిపోయిన ప్రతి జంటకు ఈ వారంలో వారి ఆట తీరు ఎలా ఉందో హోస్ట్ నాగార్జున రివ్యూ ఇస్తున్నాడు.
తేజ, యావర్ సూపర్
ఈ వారం తేజ, యావర్ ఇద్దరు కలిసి ఒక జంటగా ఆడతారు. ఇక వీళ్లిద్దరి ఆట సూపర్ అంటూ నాగార్జున ప్రశంశల జల్లు కురిపించాడు. మీ ఇద్దరినీ చూస్తే చాలా ముచ్చటేసిందని యావర్, తేజను పొగుడుతాడు. లెటర్ టాస్క్ లో(task) వాళ్లిద్దరు చేసిన పని అందరిని ఆకట్టుకుంది. అలాగే ఈ వారం టాస్క్ కూడా చాలా బాగా ఆడారు.
తొక్కలో సంచాలక్..
వీకెండ్ ప్రోమో చూస్తుంటే అమర్, సందీప్ ఇద్దరికి నాగార్జున ఫుల్ క్లాస్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. ఇద్దరి పై నాగార్జున గట్టిగానే ఫైర్ అవుతాడు.. అందరిని బొక్కలో డెసిషన్, బొక్కలో సంచాలక్ అంటావు.. మరి నువ్వు చేసిందేంటి అంటూ అందరికి ఒక వీడియో చూపిస్తారు. ఆ వీడియోలో సందీప్ బుట్టలో ఉన్న పళ్ళను కాకుండా బయట నుంచి తీసి వాటితో జ్యూస్ చేస్తాడు.. ఆ టాస్క్ కు సంచాలకులుగా చేసిన అమర్ అది తప్పు అని చెప్పకుండ సందీప్ కి సపోర్ట్ చేస్తాడు.. దాంతో ఈ వీడియో చూసిన నాగార్జున తొక్కలో సంచాలక్.. బొక్కలో జడ్జ్మెంట్ అంటూ ఇద్దరి పై సీరియస్ అవుతాడు. ఇక ప్రశాంత్, శివాజీ గౌతమ్, శుభ శ్రీ ఇద్దరు జంటలు నాగార్జున ఏం చెప్తారో అనే టెన్షన్ తో కనిపిస్తున్నారు.
ప్రోమో(promo) చూస్తుంటే ఈ వీక్ నాగార్జున హౌస్ మేట్స్ కి గట్టిగానే క్లాస్ ఇవ్వబోతున్నట్లు కనిపిస్తుంది. ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Bigg Boss 7 Telugu: రైతు బిడ్డ పై రెచ్చిపోయిన సందీప్.. లాగి మొహం పై కొట్టాడు నన్ను ..!