Bigg Boss 7 Telugu: నీకు ఎర్రగడ్డనే దిక్కు .. నువ్వు బిగ్ బాస్ మోనితవే..!

నిన్నటి నామినేషన్ ఎపిసోడ్ లో శోభా, ప్రియాంక, భోలే మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది. ఇక భోలే శోభాను నీకు ఎర్రగడ్డే దిక్కు అనడంతో వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరిగింది.

New Update
Bigg Boss 7 Telugu: నీకు ఎర్రగడ్డనే దిక్కు .. నువ్వు బిగ్ బాస్ మోనితవే..!

Bigg Boss 7 Telugu: నిన్నటి నామినేషన్ ఎపిసోడ్ లో రచ్చ రచ్చ జరిగింది. భోలే, ప్రియాంక, శోభ వీళ్ళ ముగ్గురు మధ్య జరిగిన నామినేషన్ (Bigg Boss Nomination) వాడివేడీగా జరిగింది. ఇక నామినేషన్ ప్రక్రియలో భోలే (Bhole) శోభను నీకు ఎర్రగడ్డనే దిక్కు అని అనగానే.. దానికి శోభ నీ అంత మెంటల్ ఎవ్వరూ లేరు అంటూ ఫైర్ అయ్యింది. వీరిద్దరి మధ్య పెద్ద హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది.

నువ్వు బిగ్ బాస్ మోనితవే..

శోభ (Shobha) భోలేను నామినేట్ చేస్తూ.. మీరు టాస్క్ లో 100% ఇవ్వటం లేదు, అలాగే టాస్క్ ఆడేటప్పుడు ఆడపిల్ల కాబట్టి ఊరుకున్నాను అన్నారు. అది నాకు నచ్చలేదు అంటుంది. దాంతో భోలే అవును ఆడపిల్లకు మర్యాద ఇవ్వటం తప్పా , నువ్వు బిగ్ బాస్ మోనితా లా ఆడుతున్నావు.. నిజ జీవితంలో కూడా నటించాను అని అంటాడు. ఆ మాటతో శోభా భోలే పై కోపంతో అవును.. మోనితా పాత్రనే నాకు అన్నం పెట్టింది, నన్ను బిగ్ బాస్ వరకు తెచ్చింది, నేను ఆ పాత్రకు రుణపడి ఉంటాను అంటూ భోలే పై ఫైర్ అయ్యింది. ఇక భోలే కుండ పగలగొడుతూ.. ఇది మోనితా అంటే అంటూ కుండను గట్టిగా పగలగొట్టింది.

నీకు ఎర్రగడ్డనే దిక్కు

శోభాను నామినేట్ చేస్తూ భోలే చెప్పిన రీజన్ ఏంటో క్లారిటీ లేకపోవడంతో శోభా అసలు మీరు ఏం రీజన్ తో నామినేట్ చేస్తున్నారో కరెక్ట్ గా చెప్పండి అంతే కానీ ఏదేదో చెప్పకండి అంటుంది. దానికి భోలే నీకు ఎర్రగడ్డనే దిక్కు.. అంటే తాను చెప్పింది అర్థం కావట్లేదు అనే ఉద్దేశంతో అంటాడు. ఆ మాటకు రెచ్చిపోయిన శోభా నీకన్నా మెంటల్ ఎవ్వరూ లేరు, అసలు సెన్స్ లేకుండా మాట్లాడతావు అంటూ భోలే పై కోపం తో ఊగిపోయింది.

publive-image

బిగ్ బాస్ వార్నింగ్

శోభా, భోలే నామినేషన్ సమయంలో ప్రశాంత్ (Pallavi Prashanth) మీకు బరా బర్ చేసిండు అంటూ ఎదో బూతు మాట్లాడాడు. దాంతో ప్రియాంక ముందుకు వచ్చి మీరు బిగ్ బాస్ హౌస్ లో బూతులు మాట్లాడకండి ఇక్కడ బూతులు వినడానికి రాలేదు అంటూ భోలే పై ఫైర్ అయ్యింది. అంతే కాదు బిగ్ బాస్ నేను ఈ నామినేషన్ ప్రక్రియను సాగనివ్వను అంటూ ముందుకు వచ్చి నిలబడుతుంది దాంతో బిగ్ బాస్ భోలే ఇంకోసారి బిగ్ బాస్ ఇంట్లో బూతులు మాట్లాడకండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు.

ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్న అశ్విని

ఈ సారి జరిగిన నామినేషన్ లో అశ్విని కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు ప్రేక్షకులకు అనిపిస్తుంది. ముందు అమర్ (Amar) ని నామినేట్ చేయడానికి వెళ్లిన అశ్విని అమర్ కొన్ని కారణాలు చెప్పడంతో బిగ్ బాస్ అమర్ నా నామినేషన్ ఒప్పుకోవడం లేదు నేను చేంజ్ చేసుకుంటాను అని తర్వాత అర్జున్ పేరు చెప్తుంది దాంతో అర్జున్ .. అశ్విని నువ్వు ముందు క్లారిటీగా నామినేట్ చేయడం నేర్చుకో అంటాడు.

publive-image

Also Read: Bigg Boss 7 Telugu: శివాజీ మా డాడీ.. మిస్ యు డాడీ.. కనీళ్ళు పెట్టించిన నయనీ ఎలిమినేషన్

Advertisment
తాజా కథనాలు