/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/nag-1-2-jpg.webp)
Nagarjuna Dance Videos Viral In Social Media: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రోజు బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించి ఇప్పటికీ కూడా తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇక వరుస సినిమాల్లో నటిస్తూనే కింగ్ నాగార్జున "బిగ్ బాస్" టీవీ షో కి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ బుల్లి తెర ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరిస్తున్నాడు.
Also Read: ‘గేమ్ ఛేంజర్’ మూవీ అప్ డేట్.. ఆ రోజే ‘జరగండి’ అనే తొలి సాంగ్ రిలీజ్!
View this post on Instagram
తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్ (BiggBoss) రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ కింగ్ నాగార్జున బిగ్ బాస్ షోలో ఎంతగా అలరిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగ్ బిగ్ బాస్ సీజన్7 న్యూ లుక్ అదుర్స్ అనేలా కనిపిస్తోందని బిగ్ బాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రేక్షకులు సైతం నాగార్జున కొత్త లుక్ ను చూసి ఫిదా అవుతున్నారు. నాగ్ బిగ్ బాస్ షో సీజన్7 కోసం భారీ స్థాయిలో ఛార్జ్ చేస్తున్నారని తెలుస్తోంది. వయసు 64 వచ్చినప్పటికీ ఇంకా యువ మన్మథుడిగా లాగే కనిపిస్తు ఉంటారు కింగ్ నాగార్జున.
View this post on Instagram
బిగ్ బాస్ సీజన్ 7ను తన వే ఆఫ్ స్టైల్ డీల్ చేస్తు ఉంటారు. అంతే కాదు బిగ్ బాస్ ప్రేక్షకులను, ఫ్యాన్స్ ను అలరించడానికి డ్యాన్స్ కూడా చేస్తు ఉంటారు. అయితే, సోషల్ మీడియాలో నాగర్జున బిగ్ బాస్ షో కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న వీడియోలు తెగ వైరల్ గా మారాయి. ఇది చూసిన అక్కినేని అభిమానులు వావ్ నాగ్..సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఇదేం డాన్స్ రా బాబు అంటూ కౌంటర్లు వేస్తున్నారు.
View this post on Instagram