Amar vs Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ హౌస్ లో ఇంటి సభ్యులంతా ఓట్ అపీల్ కోసం పోటీ పడుతున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు మరో టాస్క్ ఇచ్చాడు. "ఈ టాస్క్ వివిధ రౌండ్స్ లో జరుగుతుంది. అందరు తమకు ఇచ్చిన జాకెట్ ధరించి.. స్టార్ట్ బజార్ మోగగానే మిగతా వారి జాకెట్ బాల్స్ విసరాల్సి ఉంటుందని.. ఎండ్ బజార్ మోగే సమయానికి ఎవరి జాకెట్ పై ఎక్కువ బాల్స్ ఉంటాయో వారి ఆ రౌండ్ నుంచి తొలగిపోతారని తెలిపారు బిగ్ బాస్ (Bigg Boss)".
యావర్, శోభ ఔట్
ఈ టాస్క్ లో మొదటి రౌండ్ మొదలు పెట్టారు. ఇంటి సభ్యులంతా ఒకరి జాకెట్ పై ఒకరు బాల్స్ విసురుకున్నారు. ఎండ్ బజార్ మోగే సమయానికి శోభ, యావర్ జాకెట్ పై ఎక్కువ బాల్స్ ఉన్నందున వారిద్దరి మొదటి రౌండ్ నుంచి ఔట్ అయ్యారు.
కట్టు కథలు అల్లకు.. వీడి డబుల్ గేమ్ అందరికీ తెలియాలి
ఆ తర్వాత స్టార్ బజర్ మోగగానే మళ్ళీ సెకండ్ రౌండ్ మొదలు ఆడారు. ఈ రౌండ్ లో ప్రశాంత్ (Prashanth), అమర్ (Amar) ఇద్దరికీ పెద్ద గొడవే జరిగింది. ఇద్దరి ఒకరి పై ఒకరు ఆరోపణలు చేస్తూ గట్టి గట్టిగా అరుచుకున్నారు. ప్రశాంత్.. "అమర్ నన్ను గట్టిగా కొరికాడు" అంటూ వాదన మొదలు పెట్టాడు. దానికి అమర్ "నేను చేసింది తప్పు.. ఒప్పుకుంటా కానీ వీడు చేసేవి ఎవరికీ కనిపించవు" అని వాదించాడు. ఇక ప్రశాంత్ అవును.. నువ్వు చేసింది తప్పే అని చెప్పాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య వాదన ఎక్కువైంది. నేను ఉంటే ఎంత.. పోతే ఎంత.. వీడి గురించి తెలియాలి అందరికీ.. నీకున్న డబుల్ గేమ్ ఎవరికీ లేదు అని ప్రశాంత్ పై కోపంతో ఊగిపోయాడు.
వాడే నిజం.. నేనే అబద్ధం.. నన్ను ఒక పిచ్చోడిలా చూపించాలని అనుకుంటున్నాడు అని కోపంతో తల బాదుకుంటూ ప్రశాంత్ పై అరిచాడు అమర్. ఇక కూల్ గా కొన్ని నీళ్లు తాగు ఎందుకు ఆగం అవుతున్నావు అని అమర్ ను రెచ్చగొట్టాడు. ఇక అమర్ రెచ్చగొట్టకురా అని బీపీ తెచ్చుకున్నాడు. వీళ్ళిద్దరినీ ఆపడానికి అర్జున్ ప్రయత్నించాడు.
Also Read: OTT Release: మూవీ లవర్స్‌ని కిక్కెక్కించే సినిమాలు.. ఓటీటీలో కొత్త రిలీజ్‌లు ఇవే!