Big Bash League 2023: ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్లో ఆదివారం జరగాల్సిన మ్యాచ్ అనూహ్యంగా రద్దయ్యింది. పిచ్ ప్రవర్తనలో ప్రమాదకరమైన మార్పును గుర్తించిన ఆటగాల్లు ఫిర్యాదు చేయడంతో అంపైర్లు మ్యాచ్ ను మధ్యలోనే నిలిపేశారు. మ్యాచ్ రద్దయ్యే సమయానికి తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఆరు ఓవర్లు మాత్రమే ఆడింది.
ఇదీ జరిగింది..
గిలాంగ్ లోని సైమండ్స్ స్టేడియంలో ఆదివారం మెల్ బోర్న్ రెనిగేడ్స్ - పెర్త్ స్కార్చర్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతుండడాన్ని బ్యాటర్లు గమనించారు. వికెట్ కీపర్ గా ఉన్న డికీక్ కూడా బంతి గమనం సాగుతున్న తీరుపై ఆశ్చర్యపోయాడు.
టాస్ గెలిచిన మెల్ బోర్న్ రెనిగేడ్స్ పీల్డింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ రెండో బంతికే టామ్ రోజర్స్ బౌలింగ్ లో స్టీపెన్ ఎల్బీడబ్ల్యూగా పరుగుల ఖాతా తెరవకుండా వెనుదిరిగాడు. వెంటనే మరో ఓపెనర్ కూపర్ కొన్నోలీ(6) కూడా ఔటయ్యాడు. పెర్త్ స్కాచర్స్ ఆటగాడు విల్ సదర్లాండ్ వేసిన ఆరో ఓవర్‌లో తొలి మూడు బంతులు టూమచ్ గా బౌన్సయ్యాయి. కీపర్ డీకాక్ కూడా ఆ బౌన్స్ చూసి నివ్వెరపోయాడు. నోరెళ్లబెట్టిన పెర్త్ స్కార్చర్స్ బ్యాటర్లు పిచ్ పరిస్థితిపై సమీక్షించాలని అంపైర్‌ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇద్దరు కెప్టెన్లతో చర్చించిన ఎంపైర్లు మ్యాచ్‌ను మధ్యలోనే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: క్రికెట్ కు ఇది రికార్డ్ బ్రేక్ ఇయర్.. ఎలా అంటే..
ముందు రోజు రాత్రి వర్షం
ఈ మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి గిలాంగ్ లో భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో కవర్లు లీక్ అయ్యి పిచ్ పై నీరు చేరి బాల్ ఎక్కువగా బౌన్స్ అయి ఉండొచ్చని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు.