Andhra Pradesh : ఏపీలో ఎన్నికల (AP Elections) తర్వాత రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రభుత్వం మారడంతో.. స్థానిక ప్రజా ప్రతినిధులు అధికార పార్టీలోకి వెళ్లిపోతున్నారు. అనేక చోట్ల మున్సిపల్ ఛైర్మన్లు టీడీపీ (TDP) లో చేరిపోతున్నారు. తాజాగా నందికొట్కూర్ లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి (Byreddy Siddhartha Reddy) కి ఆయన పెదనాన్న రాజశేఖర్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు మరో 12 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరేలా చక్రం తిప్పారు. ఈ రోజు ఆయన సమక్షంలో వీరంతా టీడీపీలో చేరిపోయారు.
నందికొట్కూరు (Nandikotkur) వైసీపీ (YCP) ఇన్ఛార్జి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో రాజకీయాలు నడిపారు. 2018లో ఇక్కడ వైసీపీ విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దీంతో గత ఐదేళ్లు ఆయన చెప్పినట్లే ఇక్కడ నడిచింది. ఆయన నాయకత్వంలోనే ఇక్కడ వైసీపీ మున్సిపలిటీ ఛైర్మన్ పదవిని దక్కించుకుంది. గత ఎన్నికల్లో నందికొట్కూరులో వైసీపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు.
This browser does not support the video element.
రాష్ట్రంలోనూ టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో సిద్ధార్థ్ రెడ్డి పెదనాన్న అయిన రాజశేఖర్ రెడ్డి మళ్లీ యాక్టీవ్ అయ్యారు. ఈ క్రమంలోనే నందికొట్కూరు మున్సిపల్ ఛైర్మన్, 12 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఈ అంశంపై ఎలా రెస్పాండ్ అవుతారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత సిద్ధార్థ్ రెడ్డి సైలెంట్ అయ్యారు.
Also Read : ఛాంపియన్లతో మోదీ చిట్ చాట్.. నవ్వులు పూయించిన వీడియో వైరల్!