TDP : టీడీపీకి భారీ షాక్.. 400 మంది రాజీనామా..! ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. 400 మంది టీడీపీ నాయకులు తమ రాజీనామా పత్రాలను రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి పంపారు. సీటు అధికారికంగా రఘురామ కృష్ణంరాజుకు అనౌన్స్ అయితే పరిణామాలు వేరేగా ఉంటాయంటూ రామరాజు వర్గీయులు హెచ్చరిస్తున్నారు. By Jyoshna Sappogula 10 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి Shock To TDP : పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీ(TDP) కి భారీ షాక్ తగిలింది. 400 మంది టీడీపీ నాయకులు తమ రాజీనామా(Resign) పత్రాలను రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu) కి పంపారు. ఉండి సీటు రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishna Raju) కు కేటాయించడంతో అసహనం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. Also Read: అనుచరుడి కోసం రంగంలోకి రేవంత్.. ఓ మెట్టు దిగి నేడు రాజగోపాల్ రెడ్డి ఇంటికి.. తమ నాయకుడు ఎమ్మెల్యే రామరాజుకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి విడతలో తమ నాయకుడు రామరాజు పేరు ఉందని ఇపుడు ఏ ప్రాతిపదిక మీద రఘురామ కృష్ణంరాజుకు సిటు ఇస్తారని రామరాజు వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ఉండి సీటు ఆఫీసియల్ గా రఘురామ కృష్ణంరాజుకు అనౌన్స్ అయితే పరిణామాలు వేరేగా ఉంటాయని రామరాజు వర్గీయులు హెచ్చరిస్తున్నారు. Also Read: వైసీపీలోకి కీలక నేతలు..జగన్ సమక్షంలో చేరికలు ఇప్పటికే ఈ విషయంలో ఎమ్మెల్యే రామరాజు ఎమోషనల్ అయ్యారు. కార్యకర్తలతో సమావేశమై టికెట్ వేరేవారికి ఇవ్వబోతున్నారంటూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. కుటుంబసభ్యులు, కార్యకర్తల సూచన మేరకు నడుచుకుంటానన్నారు. రాజకీయాలు విరమించుకోవడంపైనా ఆలోచిస్తానని తెలిపారు. ఇలా ఉండి టీడీపీలో అసమ్మతి మరింత చెలరేగిపోతుంది. దీంతో కార్యకర్తలు అధిష్టానంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. టికెట్ ఎమ్మెల్యే రామరాజుకే ఇవ్వాలని పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. #tdp #atchannaidu #raghu-rama-krishna-raju మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి