MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్

TG: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు కోర్టు షాకిచ్చింది. జూన్ 21 వరకు ఆమె జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది. తనకు జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు అడగగా.. కోర్టు అందుకు అనుమతించింది.

New Update
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్

MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు కోర్టు షాకిచ్చింది. లిక్కర్‌ కేసులో కవిత పాత్రపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. సీబీఐ చార్జ్‌షీట్‌ను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ నెల 21 వరకు కవిత సీబీఐ జ్యుడీషియల్ రిమాండ్ ని పొడిగించింది. కాగా తనకు జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలని కోర్టును కవిత కోరింది. కవిత విజ్ఞప్తిని న్యాయస్థానం అంగీకరించింది. తదుపరి విచారణ జూన్ 21కి వాయిదా వేసింది.

కవిత ఖాతాలో రూ.292 కోట్లు..

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం ఈడీ ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ కేసులో కవితపై (Kavitha) ఈడీ అభియోగాలు నమోదు చేసింది. మొత్తం లిక్కర్ స్కాం విలువ రూ.1100 కోట్లు అని.. అందులో కవితకు ముట్టినవి రూ. 292 కోట్లు అని.. ఆప్‌ నేతలకు రూ. 100 కోట్లు అని ఈడీ ఛార్జిషీట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కవిత తన ఫోన్‌లో సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఈడీ (ED) తెలిపింది. మరోవైపు ఇవాళే కవిత రిమాండ్ జులై 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. 

Also Read: పవన్ కళ్యాణ్ అంటే పవనం కాదు.. ఒక సునామీ.. మోదీ పవర్ ఫుల్ డైలాగ్స్..!

Advertisment
తాజా కథనాలు