AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఊహించని షాక్ ఇచ్చిన టీడీపీ!

పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఛైర్మన్‌ అలీం భాషాతో సహా 12మందిపైగా కౌన్సిలర్లు వైసీపీకి గుడ్ బై చెప్పారు. చల్లాబాబు సమక్షంలో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.

New Update
AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఊహించని షాక్ ఇచ్చిన టీడీపీ!

Peddireddy Ramachandra Reddy:  2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీపై అసహనం వ్యక్తం చేస్తూ సొంత పార్టీ నేతలు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఛైర్మన్‌ అలీం భాషాతో సహా 12మందిపైగా కౌన్సిలర్లు వైసీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీకి రాజీనామా చేసి చల్లాబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

Also Read: ‘కల్కి’ కోసం నా చెప్పులు కూడా అరిగిపోయాయి : నాగ్ అశ్విన్

పుంగనూరు మున్సిపల్ పీఠంపై దృష్టి పెట్టిన పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ చల్లాబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆటలు సాగావన్నారు. తండ్రి, కొడుకులు ఎంత మోసకారులో ప్రజలకు తెలిసిందన్నారు. పుంగనూరు కుటుంబ పరిపాలనా సాగిస్తూ వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు.

Also Read: తిరుమలలో భక్తుల దోపిడీ.. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే జరిగేది ఇదే: కిరణ్ రాయల్

పుంగనూరులో ఒకలా.. ఢిల్లీలో ఒకలా మాట్లాడటం పెద్దిరెడ్డి కుటుంబానికే చెల్లిందన్నారు. ఎన్నికల ముందు మైనారిటీలు బీజేపీకి ఓట్లు వేయద్దాని తండ్రి, కొడుకులు ప్రచారం చేసి పదిరోజుల్లోనే బీజేపీకి మద్దతు ఇచ్చారన్నారు. అబద్ధాలు చెప్పి పుంగనూరు ప్రజలను, మున్సిపల్ చైర్మన్ సహా కౌన్సిలర్లును మోసం చేశారన్నారు. పెద్దిరెడ్డి అక్రమాలు అన్ని ప్రజల ముందు బయట పెట్టే సమయం వచ్చిందని.. మీ వైఖరి నచ్చేక కౌన్సిలర్లు అందరూ రాజీనామా చేసి టీడీపీలో చేరారని ఉద్ఘాటించారు.

Advertisment
తాజా కథనాలు