MLC Election: సొంత జిల్లాలో రేవంత్ కు బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం!

TG: సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై నవీన్ రెడ్డి గెలుపొందారు.

New Update
MLC Election: సొంత జిల్లాలో రేవంత్ కు బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం!

MLC Election: సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై నవీన్ రెడ్డి గెలుపొందారు. మొత్తం 1437 ఓట్లు పోల్ అవ్వగా.. అందులో 21 ఓట్లు చెల్లనివిగా అధికారులు నిర్దారించారు. కాగా కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామాతో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కసిరెడ్డి నారాయణరెడ్డి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఓట్లు ఇలా..

* బీఆర్ఎస్ - 763
* కాంగ్రెస్ - 652
* ఇండిపెండెంట్ అభ్యర్థి - 01

బీఆర్ఎస్ కు ఊరట.. రేవంత్ కు షాక్

అసెంబ్లీ ఎన్నికల్లో  ఓటమి చెందిన బీఆర్ఎస్ పార్టీకి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు కాస్త ఊరటనిచ్చాయనే చెప్పాలి. తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి ఉండదని బీజేపీ, కాంగ్రెస్ లు చేస్తున్న ప్రచారాలకు ఈ ఫలితం కాస్త బీఆర్ఎస్ పార్టీకి ఊపిరి తెచ్చిందనే చెప్పాలి. సొంత సీటును తిరిగి తమ ఖాతాలో వేసుకుంది బీఆర్ఎస్. మరోవైపు సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. సొంత స్థానంలో తమ అభ్యర్థిని గెలిపించుకునే విషయంలో సీఎం రేవంత్ ఫెయిల్ అయ్యారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పట్టుబట్టి మన్నె జీవన్ రెడ్డికి టికెట్ ఇప్పించుకొని.. అతని గెలుపు తన భుజంపై వేసుకొని ప్రచారం చేసిన ఫలితం లేకుండా అయింది.

Advertisment
తాజా కథనాలు