/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/kejriwal-jpg.webp)
CM Kejriwal: లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలిగించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. సుర్జీత్ సింగ్ యాదవ్ ఈ పిటిషన్ వేశారు. ఆర్థిక కుంభకోణాలకు పాల్పడ్డ కేజ్రీవాల్ కు సీఎంగా ఉండే అర్హత లేదని.. ఆయన్ను వెంటనే సీఎం పదవి నుంచి తొలిగించాలని పిటిషన్ లో కోరారు.
#WATCH | "What I had to say I have said in court," says Senior Advocate Abhishek Manu Singhvi appearing for Delhi CM Arvind Kejriwal in Rouse Avenue Court. pic.twitter.com/vcTVi3VqxR
— ANI (@ANI) March 22, 2024
ALSO READ: ఎమ్మెల్యే దానంకు షాక్.. హైకోర్టు నోటీసులు
రూ.100 కోట్లు కాదు.. రూ.600 కోట్ల స్కామ్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. అయితే ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను ఈడీ హాజరుపరిచింది. ఆయన అరెస్టుపై ప్రస్తుతం కోర్టులో వాడివేడిగా వాదనలు సాగుతున్నాయి. కేజ్రీవాల్ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు ఈడీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ASG రాజు వాదనలు వినిపించారు.
ASG రాజు వినిపించిన వాదనలు
- ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్
- సౌత్ గ్రూప్‌కు లబ్ది చేకూరేలా ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన
- ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చేతులు మారింది రూ.100 కోట్లు కాదు రూ.600 కోట్లు
- కేజ్రీవాల్‌కు రూ.600 కోట్ల ముడుపులు అందాయి
- ఈ డబ్బులను గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ వినియోగించింది
- హవాలా మార్గంలో రూ.45 కోట్లు చెన్నై, ఢిల్లీ, ముంబై నుంచి గోవాకు డబ్బులు చేరాయి
- సౌత్ గ్రూప్, కేజ్రీవాల్‌కు విజయ్ నాయర్ మధ్యవర్తిగా వ్యవహరించారు
- 9 సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు
- కేజ్రీవాల్‌ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరిన ఈడీ
- PMLA సెక్షన్ 19 ప్రకారమే కేజ్రీవాల్ అరెస్టు జరిగింది
- అరెస్టు తర్వాత రెండుసార్లు మెడికల్ టెస్టులు నిర్వహించాం
- సెంథిల్ బాలాజీ కేసు తీర్పును రిఫర్ చేస్తూ ASG రాజు వాదనలు