Big Ship: టైటానిక్ కంటే పెద్ద ఓడ.. జపాన్ లో పుట్టి.. గుజరాత్ లో ముక్కలైంది.. 

టైటాన్ షిప్ కంటే అతి పెద్దదైన కూడా అది. జపాన్ లో ప్రాణం పోసుకుంది. అప్పటి నుంచి చేతులు మారి చివరకు గుజరాత్ లో ముక్కలుగా విడిపోయి ప్రయాణాన్ని ముగించింది. ప్రపంచంలోనే అతి పెద్ద నౌక కావడం దానికి శాపంగా మారింది. ఇది ప్రపంచంలోని అనేక ప్రధాన వాణిజ్య మార్గాలను దాటలేకపోయింది. 

New Update
Big Ship: టైటానిక్ కంటే పెద్ద ఓడ.. జపాన్ లో పుట్టి.. గుజరాత్ లో ముక్కలైంది.. 

Big Ship: టైటానిక్ ఇంగ్లండ్ తీరాన్ని 1912లో విడిచిపెట్టినప్పుడు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఓడ. దీని పొడవు దాదాపు 882 అడుగులు. కానీ ఈ ఓడ తన మొదటి ప్రయాణంలోనే మునిగిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ప్రపంచం ప్రయాణీకుల పెద్ద ఓడలను సిద్ధం చేసే పని పక్కన పెట్టినట్టు కనిపించింది. అయితే, కార్గో కోసం పెద్ద ఓడల నిర్మాణం కొనసాగింది. 1979లో జపాన్ అలాంటి ఓడను నిర్మించింది, ఇది టైటానిక్ కంటే దాదాపు రెట్టింపు పొడవుతో ఉంటుంది.  30 సంవత్సరాల పాటు ఈ నౌక సముద్రాన్ని సరుకు రవాణాతో శాసించింది. ఈ భారీ ఓడ (Big Ship)చివరకు భారతదేశంలోని గుజరాత్‌లో కనుమరుగైపోయింది. 

అవును, జపాన్‌కు చెందిన సుమిటోమో హెవీ ఇండస్ట్రీస్ 1974-1979 మధ్యకాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద నౌక 'సీవైజ్ జెయింట్'ను నిర్మించింది. దీనికి మొదట్లో ఈ పేరు లేదు. అయితే తర్వాత దీనికి ఒప్పామా, హ్యాపీ జెయిం,  జహ్రే వైకింగ్ అనే పేర్లు కూడా వచ్చాయి. ఈ నౌక(Big Ship) ప్రారంభం నుంచి  అనేక వివాదాలతో ముడిపడి ఉంది.

యజమాని దానిని తీసుకోవడానికి నిరాకరించడంతో..
ఈ నౌక మొదటి నుంచి నొప్పులతోనే తన ప్రయాణం సాగించింది. ఈ ఓడ(Big Ship) జపాన్‌లోని ఒప్పామా షిప్‌యార్డ్‌లో తయారు అయింది. అయితే దాని గ్రీకు యజమాని దానిని తీసుకోవడానికి నిరాకరించాడు. అప్పటికి దానికి పేరు లేదు. అప్పుడు సుదీర్ఘ న్యాయ పోరాటం జరిగింది, ఆ సమయంలో షిప్‌యార్డ్ పేరు మీద ఒప్పామా అని పేరు పెట్టారు. తర్వాత షిప్‌యార్డ్ ఈ నౌకను చైనాకు చెందిన సి.వై.కి అప్పగించింది. దానిని తుంగ్‌కు విక్రయించారు.  అతను దానికి 'సీవైజ్ జెయింట్' అని పేరు పెట్టాడు.

ఇరాన్-ఇరాక్ యుద్ధం కారణంగా..
ఈ నౌక(Big Ship) 'జహేరే వైకింగ్' పేరుతో అత్యంత ప్రజాదరణ పొందింది. దీని పొడవు దాదాపు 1500 అడుగులు. ఇది ప్రధానంగా చమురు ట్యాంకర్ల రవాణాలో ఉపయోగ పడింది. 1988లో, ఈ ఓడ ముడి చమురు రవాణా కారణంగా దాని జీవిత చక్రంలో అతిపెద్ద వైఫల్యాన్ని చవిచూసింది. అప్పుడు ఈ నౌక లారాక్ ద్వీపం వద్ద ఇరాన్ ముడి చమురును తీసుకువెళుతోంది. అప్పుడు సద్దాం హుస్సేన్ వైమానిక దళం దానిపై దాడి చేసింది.  అది లోతులేని నీటిలో కొద్దిగా మునిగిపోయింది. అయితే, ఇది తరువాత రిపేర్లు జరుపుకుంది. తరువాత,  1991లో నార్వేజియన్ కంపెనీ దీనిని కొనుగోలు చేసింది. అందుకే దీనికి 'జహరే వైకింగ్' అనే పేరు వచ్చింది.

ఈ ఓడ 1991లో మళ్లీ అమ్మినపుడు  దాని ధర సుమారు 40 మిలియన్ డాలర్లు. నేటి డాలర్ విలువ ప్రకారం చూస్తే దాదాపు రూ.330 కోట్లు ఉంటుంది. ఈ ఓడ(Big Ship) ప్రపంచంలోనే అతిపెద్ద స్వీయ చోదక నౌకగా పేరు పొందింది.

గుజరాత్ లో కనుమరుగు..
దాదాపు 30 సంవత్సరాల పాటు సముద్రాన్ని ఏలిన  తరువాత, ఇది 2009 సంవత్సరంలో భారతదేశంలోని గుజరాత్‌కు చేరుకుంది. ఇక్కడ ఈ ఓడ(Big Ship) ప్రపంచంలోని అతిపెద్ద షిప్ బ్రేకింగ్ యార్డులలో ఒకటైన 'అలాంగ్'లో ముక్కలు అయిపొయింది.  ఈ ఓడను విచ్ఛిన్నం చేయడానికి ఏడాది పొడవునా 1000 మంది కార్మికులు పని చేశారు. ఈ ఓడ యాంకర్ దాదాపు 36 టన్నులు.

పెద్దది కావడమే శాపం..
అయితే, ప్రపంచంలోనే అతి పెద్ద నౌక(Big Ship)కావడం దానికి శాపంగా మారింది. ఈ నౌక ప్రపంచంలోని అనేక ప్రధాన వాణిజ్య మార్గాలను దాటలేకపోయింది. ఇందులో పనామా కెనాల్, సూయజ్ కెనాల్, ఇంగ్లీష్ ఛానల్ ఉన్నాయి.

Also Read: పరుగులు తీస్తున్న సూచీలు.. లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. 

Watch this interesting News:

Advertisment
తాజా కథనాలు