Guntur GDCC Bank : గుంటూరు జీడీసీసీ బ్యాంకులో భారీ కుంభకోణం! గుంటూరులోని జీడీసీసీ బ్యాంకులో ఒక్కొక్కటిగా భారీ కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంకులో రుణాల పేరుతో కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. రైతులు కాని వారి ఆధార్ కార్డులు సేకరించి, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి బ్యాంకు సొమ్మును మింగేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. By Bhavana 31 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Guntur GDCC Bank Scam: గుంటూరులోని జీడీసీసీ బ్యాంకులో ఒక్కొక్కటిగా భారీ కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంకులో రుణాల (Farmer Loans) పేరుతో కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. రైతులు కాని వారి ఆధార్ కార్డులు సేకరించి, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి, రైతుల రుణాల పేరుతో బ్యాంకు సొమ్మును మింగేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత పాలక వర్గంలోని కొంత మంది కీలక నాయకులు, బ్యాంక్ అధికారులు కుమ్మకై, రైతుల పేరుతో రుణాల స్కామ్ చేసినట్లు ప్రచారం కొనసాగుతుంది. బ్యాంకులో తీసుకున్న రుణాలు చెల్లించాలని, రైతుల పేరుతో ఉన్న వ్యక్తులకు నోటీసులు పంపించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక, ఈ వ్యవహారంలో కొంత మంది కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాలు కూడా చేతులు కలిపినట్లు సమాచారం. నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు సృష్టించి బ్యాంకు నుంచి నిధులు పొందిన కొందరు వ్యక్తులు.. ఈ విషయంలో బ్యాంకు కీలక అధికారులు, సూత్రధారులుగా పని చేశారనే ప్రచారం జోరుగా సాగుతుంది. రైతుల జాబితాతో ఎంత మంది నకిలీ రుణాల బాధితులు ఉన్నారో అనే లెక్కలను బ్యాంక్ ఉన్నత అధికారులు బయటకు తీస్తున్నారు. Also Read: వయనాడ్ లో గల్లంతైన ఆ 600 మంది కార్మికులు ఎక్కడ..? #ap-news #gunturu #farmer-loans మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి