BREAKING: సజ్జల, జోగి రమేష్‌కు బిగ్ రిలీఫ్ AP: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆగస్టు 12 వరకు పొడిగించింది. అలాగే సీఎం చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ పొడిగించింది. By V.J Reddy 23 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Sajjala: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వైసీపీ ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలశిల, దేవినేని అవినాష్, నందిగామ సురేష్ ముందస్తు బెయిల్ ఆగస్టు 2 వరకు పొడిగించింది. అలాగే ఈ కేసులో సజ్జల, మాజీ ఎమ్మెల్యే ఆర్కేలకు ఊరట లభించింది. దాడి కేసులో ఈరోజు వరకు వీరిద్దరినీ నిందితులుగా చేర్చ లేదని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. ఒకవేళ నిందితులుగా చేర్చితే ఐదు రోజుల ముందే సమాచారం ఇస్తామని కోర్టుకు తెలిపింది. సజ్జల, ఆర్కే పిటిషన్లు డిస్పోజ్ చేసింది హైకోర్టు. జోగి రమేష్ కు కూడా.. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ పొడిగించింది ఏపీ హైకోర్టు. సీఎం చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించిన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు జోగి రమేష్. ఆగస్టు 2 వరకు ముందస్తు బెయిల్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. #sajjala-rama-krishan-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి