Chandrababu: చంద్రబాబు బెయిల్ రద్దు.. విచారణ వాయిదా!

AP: టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ స్కాం కేసులో బెయిల్ రద్దు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. బెయిల్‌ షరతులు ఉల్లంఘించొద్దని సీఐడీకి సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణ మే 7వ తేదీకి వాయిదా వేసింది.

Chandrababu: చంద్రబాబు బెయిల్ రద్దు.. విచారణ వాయిదా!
New Update

TDP Chief Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ స్కాం కేసులో బెయిల్ రద్దు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. బెయిల్‌ షరతులు ఉల్లంఘించొద్దని సీఐడీకి సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణ మే 7వ తేదీకి వాయిదా వేసింది.

మధ్యంతర బెయిల్ పై చంద్రబాబు..

టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. స్కిల్ స్కాం కేసులో తనకు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఈరోజు తీర్పు వెల్లడించింది. విచారణలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. 

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో భాగంగా చంద్రబాబును ఆగస్టు 9న ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. దాదాపు 52 రోజులపాటు రాజమండ్రి జైలులో ఉన్నారు చంద్రబాబు. అక్టోబర్ 31న అనారోగ్య సమస్యల కారణంగా నాలుగు వరాల షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది హైకోర్టు. ప్రస్తుతం చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై బయట ఉన్నారు.

అసలు స్కిల్ స్కాం కేసు ఏంటీ..?

➡ రూ.371 కోట్ల కుంభకోణం

➡ షెల్ కంపెనీల ద్వారా రూ.241 కొల్లగొట్టారని చంద్రబాబుపై ఆరోపణ

➡ 2017-18లో నకిలీ ఇన్వాయిస్‌లతో అవినీతి బాగోతం ఉందని చర్చ

➡ చంద్రబాబే సూత్రధారి, పాత్రధారి అంటోన్న ఏపీ సీఐడీ కేసు

➡ కొల్లగొట్టిన వందల కోట్లలో రూ.27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు చంద్రబాబుపై ఆరోపణలు

➡ బ్యాంక్ స్టేట్ మెంట్లు , రికార్డులు కోర్టుకు సమర్పించిన ఏసీబీ

➡ చంద్రబాబుపై 120(బి), 166, 167, 418, 420, 465, 468, 201, 109 ..

➡ రీడ్ విత్ 34 అండ్‌ 37 ఐపీసీ సెక్షన్‌ల కింద కేసు నమోదు.

➡ సీఆర్‌పీసీ సెక్షన్‌ 50(1) కింద బాబుకు నోటీస్ ఇచ్చిన సీఐడీ

➡ 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్సన్ చట్టం కింద చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు

#chandrababu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe