ISRO Gaganyaan: మరో ఘనత సాధించిన ఇస్రో.. గగన్‌యాన్ TV-D1 టెస్ట్ గ్రాండ్ సక్సెస్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో గ్రేట్ సక్సెస్ సాధించింది. గగన్‌యాన్ ప్రయోగం సక్సెస్ అయ్యింది. గగన్‌యాన్ TV-D1 టెస్ట్ ఫ్లైట్‌ను విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. TV-D1 గగన్‌యాన్ ఫ్లైట్, క్రూ ఎస్కేప్ సిస్టమ్ మిషన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ ప్రయోగం సక్సెస్‌తో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. By Shiva.K 21 Oct 2023 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ISRO TV-D1 Gaganyaan Missison Test Success: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో గ్రేట్ సక్సెస్ సాధించింది. గగన్‌యాన్ TV-D1 టెస్ట్ ఫ్లైట్‌ను సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించింది ఇస్రో. TV-D1 గగన్‌యాన్ ఫ్లైట్, క్రూ ఎస్కేప్ సిస్టమ్ మిషన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ ప్రయోగం సక్సెస్‌తో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నాను. గగన్‌యాన్ టీవీ-డి1 మిషన్ విజయవంతమైనందుకు చాలా సంతోషంగా ఉందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ (S Somanath) ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయంతో గగన్‌యాన్ మిషన్‌లో తొలి అడుగు పడింది. #WATCH via ANI Multimedia | Big milestone by ISRO. TV-D1 Gaganyaan test vehicle/crew escape system mission successful!https://t.co/ocWewOFScr — ANI (@ANI) October 21, 2023 గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ఇస్రో ‘టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్’(టీవీ-డీ1) తొలి పరీక్ష చేప్టటింది. శనివారం ఉదయం శ్రీహరి కోట (Sriharikota) నుంచి ఈ ఫ్లైట్‌ను నింగిలోకి పంపించింది. తొలుత 8.30 గంటలకు దీనిని ప్రయోగించాల్సి ఉండగా.. సాంకేతిక సమస్యల కారణంగా పలుమార్లు వాయిదా పడింది. చివరకు ఉదయం 10 గంటలకు ఈ మిషన్‌ను ప్రయోగిచంగా.. అది సక్సెస్ అయ్యింది. శ్రీహరికోట నుంచి నింగిలోకి సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ దూసుకెళ్లగా.. క్రూ మాడ్యూల్ పారాచూట్‌ల సాయంతో సముద్రంలోకి సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఫ్లైట్ శిఖరభాగాన ఏర్పాటు చేసిన క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టమ్.. భూమికి 17 కిలోమీటర్లు దూరంలో అంతరిక్షంలో వదిలిపెట్టిన తరువాత దానికి పైభాగంలో అమర్చిన ప్యారాచూట్లు తెరుచుకున్నాయి. ఆ ప్యారాచూట్ల సాయంతో క్రూమాడ్యూల్ బంగాళాఖాతంలో దిగింది. అయితే, సింగిల్ స్టేజీలో ఈ ప్రయోగాన్ని పూర్తి చేసింది ఇస్త్రో (ISRO). కేవలం 8.84 నిమిషాల్లోనే ఈ టెస్ట్ సక్సెస్ అయ్యింది. కాగా, శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో క్రూమాడ్యూల్ పడగా.. అప్పటికే ప్రత్యేక బోట్‌లో వేచి ఉన్న కోస్టల్ నేవీ సిబ్బంది దానిని సురక్షితంగా తీసుకువచ్చారు. #WATCH | ISRO chief S Somanath says, "I am very happy to announce the successful accomplishment of Gaganyaan TV-D1 mission" pic.twitter.com/MyeeMmUSlY — ANI (@ANI) October 21, 2023 #WATCH | ISRO successfully launches test flight for Gaganyaan mission pic.twitter.com/PN6et991jg — ANI (@ANI) October 21, 2023 ఇకపోతే.. గగన్‌యాన్‌లో వ్యోమగాముల భద్రతకు సంబంధించి ఈ ప్రయోగం చాలా కీలకం. అలాంటి ప్రయోగం.. సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషంలో మునిగిపోయారు. వాస్తవానికి గగన్‌యాన్ మిషన్‌కు ముందు ఇస్రో 4 పరీక్షలు నిర్వహించాని నిర్ణయించింది. దీని ప్రకారం.. మొదటగా టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్(టీవీ-డీ1) ప్రయోగం చేపట్టింది. ఈ ప్రయోగం సక్సెస్ అవడంతో.. దీని ఆధారంగా ఇస్రో తదుపరి పరీక్షలకు సిద్ధమవుతుంది. ఈ ప్రయోగంలో బాగంగా క్రూ ఎస్కేప్ సిస్టమ్ సమర్థత, క్రూ మాడ్యూల్ పనితీరు, వ్యోమనౌకను క్షేమంగా కిందకి తెచ్చే డిసలరేషన్ వ్యవస్థ పటిష్ఠతను పరిశీలిస్తుంది. అలాగే సాగర జలాల్లో పడే క్రూ మాడ్యూల్‌ను సేకరించి, తీరానికి తీసుకువచ్చే కసరత్తునూ పరీక్షిస్తుంది ఇస్రో. Also Read: విశాఖలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా.. యువకుడు స్పాట్ డెడ్.. #WATCH | Sriharikota: ISRO launches test flight for Gaganyaan mission ISRO says "Mission going as planned" pic.twitter.com/2mWyLYAVCS — ANI (@ANI) October 21, 2023 #WATCH | Sriharikota: ISRO launches test flight for Gaganyaan mission after first test flight was aborted pic.twitter.com/pIbmjyJj3W — ANI (@ANI) October 21, 2023 Also Read: ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగం.. మిషన్ గగన్‌యాన్‌లో తొలి ప్రయోగం #isro #isro-tv-d1-gaganyaan-test-success #tv-d1-gaganyaan-test మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి