గత తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల (YS Sharmila) సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆమె కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షర్మిలకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో ఆమెకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. షర్మిలకు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు సోనియా (Sonia Gandhi), రాహుల్ (Rahul Gandhi) హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: KTR: ‘సిగ్గుపడుతున్నాం..’ గవర్నర్‌పై అసెంబ్లీలో కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు!
దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా షర్మిలను నియమించే అవకాశం ఉంది. లోక్ సభ ఎన్నికలకు షర్మిల ప్రచారం చేయనునున్నట్లు తెలుస్తోంది. అయితే.. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల ఎలా వ్యవహరిస్తారన్న అంశంపై చర్చ సాగుతోంది. అయితే.. ఇక్కడి రాజకీయాల్లో జోక్యం లేకుండా కేవలం ప్రచారానికి మాత్రమే ఉపయోగిస్తే తమకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చెబుతోంది.
ఇది కూడా చదవండి: Telangana Assembly:అచ్చోసిన ఆంబోతులు…కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
ఈ నేపథ్యంలో షర్మిల త్వరలో సోనియాగాంధీతో భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం షర్మిల కాంగ్రెస్ చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహం నిమిత్తం అమెరికాలో ఉన్నారు. ఫిబ్రవరిలో ఆమె కుమారుడి వివాహం జరిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.