BIG BREAKING: ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఈ రోజు ఈడీ అధికారులు హైదరాబాద్ లోని కార్యాలయంలో విచారించారు. ఇటీవల నిర్వహించిన సోదాలకు సంబంధించి ఆయన స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డ్ చేశారు.

New Update
BIG BREAKING: ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే

BRS MLA Gudem Mahipal Reddy: ఈడీ విచారణకు (ED Investigation)పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి హాజరయ్యారు. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో ఈ రోజు మహిపాల్‌రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ అనంతరం ఈడీ కార్యాలయం నుంచి ఆయన వెళ్లిపోయారు. మళ్లీ విచారణకు పిలిస్తే వస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులకు తెలిపినట్లు సమాచారం. ఇటీవల మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 2 రోజుల పాటు ఆయన నివాసంలో సోదాలు (ED Raids) జరిగాయి.

మొత్తం రూ.300 కోట్ల అవినీతి జరిగిందని సోదాల్లో తేల్చారు అధికారులు. మైనింగ్‌ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ కేసు నమోదు చేసింది. రూ.39కోట్ల ట్యాక్స్‌ ఎగ్గొట్టినట్టు ఎమ్మెల్యేపై ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈడీ దాడుల తర్వాత ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఢిల్లీలో ప్రతక్షమయ్యారు. కేసీఆర్‌ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో నిర్వహించిన అత్యవసర మీటింగ్‌కు కూడా వెళ్లకుండా మహిపాల్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఆ సమయంలో తీవ్ర చర్చనీయాంశమైంది.

అయితే.. బీఆర్ఎస్ పార్టీని వీడాలని ఆయన డిసైడ్ అయ్యారన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. ఆయన బీజేపీలో (BJP) చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌తో కూడా ఆయన టచ్‌లోకి వెళ్లారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మహిపాల్ రెడ్డి ఈడీ విచారణకు హాజరవడం హాట్ టాపిక్ గా మారింది.

Advertisment
తాజా కథనాలు