Big Breaking: జనసేన ఫస్ట్ లిస్ట్ విడుదల

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగుతున్న జనసేన అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 8 స్థానాలకు అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేసింది. జనసేన ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ తెలంగాణలో పోటీ చేస్తున్న తొలి ఎన్నిక ఇదే.

New Update
Andhra Pradesh : టీడీపీ-జనసేన పొత్తుకు శనిలా పట్టిన "23".. ప్చ్‌..! ట్రోలింగ్‌ ఆగెదెప్పుడు?

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఎనిమిది అభ్యర్థులతో జనసేన ఫస్ట్ లిస్ట్ (Janasena First List) విడుదల చేసింది. జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో కూకట్ పల్లి, రంగారెడ్డి జిల్లాలో తాండూరు, నల్గొండ జిల్లాలో కోదాడ, మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూల్, ఖమ్మం జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వరావుపేట టికెట్లకు అభ్యర్థులను ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పొత్తుల్లో భాగంగా తమకు పదికి పైగా సీట్లు ఇవ్వాలని జనసేన బీజేపీని కోరింది. చివరికి 8 సీట్లను ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 8 మంది అభ్యర్థులను పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారని ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం. శేరిలింగంపల్లి టికెట్ కోసం జనసేన తీవ్రంగా ప్రయత్నించినా.. బీజేపీ అంగీకరించలేదని తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ లో కేవలం కూకట్ పల్లికే పరిమితమైంది జనసేన.
ఇది కూడా చదవండి: తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి కావాలి: కేసీఆర్ పేరెత్తకుండా సాగిన పవన్ ప్రసంగం

జనసేన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి..
1. కూకట్ పల్లి-ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
2. తాండూరు-నేమూరి శంకర్ గౌడ్
3. కోదాడ-మేకల సతీష్ రెడ్డి
4. నాగర్ కర్నూల్-వంగ లక్ష్మణ్ గౌడ్
5. ఖమ్మం-మిర్యాల రామకృష్ణ
6. కొత్తగూడెం-లక్కినేని సురేందర్ రావు
7. వైరా-తేజావత్ సంపత్ నాయక్
8. అశ్వరావుపేట-ముయబోయిన ఉమాదేవి
publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు