/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Pilot-Rohith-Reddy-jpg.webp)
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ రోజు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో దాడులు చేస్తున్నారు ఐటీ అధికారులు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ కేంద్రంలోని రోహిత్ రెడ్డి నివాసంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నివాసంలో రూ.20 లక్షల నగదును ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నగదుతో పాటు పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిని ఐటీ అధికారులు అదులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే నివాసంలో భారీగా నగదు ఉందన్న సమాచారంతోనే ఐటీ అధికారులు పలు చోట్ల దాడులు చేస్తున్నారు. రానున్న ఒకటి, రెండు రోజుల్లో ఈ దాడులు వివిధ పార్టీల నేతలు, అభ్యర్థులపై మరిన్ని జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.