Congress : స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అలర్ట్.. ఎంపీలకు విప్ జారీ!

మరికొన్ని గంటల్లో లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరగనున్న వేళ కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది. తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఎంపీలంతా రేపు ఉదయం 11 గంటలకు సభకు హాజరుకావాలని విప్ లో పేర్కొంది. ఈ మేరకు పార్టీ చీఫ్ విప్ సురేష్ ఎంపీలకు విప్ జారీ చేశారు.

Congress : స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అలర్ట్.. ఎంపీలకు విప్ జారీ!
New Update

Speaker Election : రేపు లోక్‌సభ (Lok Sabha) లో స్పీకర్ ఎన్నికపై ఓటింగ్ (Voting) జరగనుండడంతో కాంగ్రెస్ పార్టీ (Congress Party) తమ ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ చేసింది. ఆ పార్టీ చీఫ్ విప్ కే.సురేష్ ఎంపీలకు విప్ జారీ చేశారు. ఎంపీలంతా ఉదయం 11 గంటలకు సభలో ఉండాలని సూచించారు. సభ వాయిదా పడే వరకు సభలోనే ఉండాలని ఆదేశించారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) నివాసంలో ఇండియా కూటమి నాయకులు సమావేశం అయ్యారు. రేపు స్పీకర్ ఎన్నిక సందర్భంగా అవలంభించాల్సిన వ్యూహంపై వీరు చర్చించారు. ఇదిలా ఉంటే.. రేపు జరగనున్న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

publive-image

దాదాపు 50 ఏళ్ల తర్వాత లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. లోక్‌సభ స్పీకర్‌ కోసం చరిత్రలో రెండు సార్లు మాత్రమే ఎన్నిక జరిగింది. 1952, 1976 ఎమర్జెన్సీ టైంలో లోక్‌సభ స్పీకర్‌ కోసం ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సారి కూడా ఏకగ్రీవం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నాలు చేసింది. అయితే.. డిప్యూటీ స్పీకర్‌ పదవి ప్రతిపక్షానికి ఇస్తేనే స్పీకర్‌కు మద్దతిస్తామని ఇండియా కూటమి కండిషన్ పెట్టింది. ఈ కండిషన్ కు ఎన్డీఏ అంగీకరించకపోవడంతో ఇండియా కూటమి సురేష్ కొడికున్నిల్ ను స్పీకర్ అభ్యర్థిగా బరిలోకి దించింది. తాజా మాజీ స్పీకర్ ఓంబిర్లాను ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది. రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక జరగనుంది. 

Also Read : కేజ్రీవాల్‌ అరెస్ట్‌!

#lok-sabha #congress-party #speaker-election
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe