Bigg Boss 7: ఉల్టా పుల్టా, డబుల్ ఎలిమినేషన్..! ఆ ఇద్దరు సీక్రెట్ రూమ్..?

ఈ వారం బిగ్ బాస్ సీజన్ 7 లో డబుల్ ఎలిమినేషన్ లేదా త్రిబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. పల్లవి ప్రశాంత్ కూడా ఎలిమినేట్ అనే వార్త వైరల్ అవుతుంది.

Bigg Boss 7: ఉల్టా పుల్టా, డబుల్ ఎలిమినేషన్..! ఆ ఇద్దరు సీక్రెట్ రూమ్..?
New Update

ఇప్పటి వరకు జరిగిన సీజన్స్ వేరు ఈసారి సీజన్ వేరు అన్నట్లుగానే ఉంది.. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా లాగానే ఉంది.. చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతున్న సీజన్ 7 లో గత సీజన్స్ లో ఎప్పుడు జరగనట్లు ఒకేసారి త్రిబుల్ ఎలిమినేషన్ జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే పల్లవి ప్రశాంత్ కూడా ఎలిమినేట్ అయ్యాడనే వార్త వైరల్ అవుతుంది. ప్రోమోలో నాగార్జున మీరు ఊహించనివి జరుగుతాయి అంటూ ఒక హింట్ ఇస్తాడు. దీంతో అందరు ఉల్టా పుల్టా అన్నట్లుగా త్రిబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి..

పల్లవి ప్రశాంత్ ఎలిమినేషన్

బిగ్ బాస్ హౌజ్ నుంచి పల్లవి ప్రశాంత్ ఎలిమినేట్ అయ్యాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ సోషల్ మీడియాలో ఈ వారం ఓటింగ్ పోల్స్ ఆధారంగా చూస్కుంటే అందరి కంటే ప్రియాంక లీస్ట్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత తేజ, శుభ శ్రీ లీస్ట్ లో ఉన్నారు.. పల్లవి ప్రశాంత్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు ఎందుకంటే ప్రశాంత్ పవర్ అస్త్ర గెలుచుకొని ఈ వారం సేఫ్ జోన్ లో ఉన్నాడు.

ఆ ఇద్దరు సీక్రెట్ రూమ్ కు

ప్రోమోలో నాగార్జున మీరు ఊహించనిది జరగబోతుంది అంటాడు. దీని ప్రకారం త్రిబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో అనిపిస్తుంది. ఒకరిని ఎలిమినేట్ చేసి.. మిగతా ఇద్దరిని సీక్రెట్ పంపుతారు అనే చర్చ కూడా జరుగుతుంది. అయితే ప్రోమోలో నాగార్జున ఇంట్లో ఉండటానికి అనర్హులైన ముగ్గురి పేర్లు చెప్పమంటే చాలా మంది అమర్, గౌతమ్ పేర్లు చెప్తారు.. కాబట్టి వీళ్ళిద్దరు సీక్రెట్ రూం కు వెళ్ళే అవకాశం ఉంది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీస్

బిగ్ బాస్ చరిత్రలో మొదటి సారి 7వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఈ ఆదివారం జరగోబోయే ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ సీజన్ 14 మందితో స్టార్ట్ అయ్యింది ఇప్పటికే నాలుగు వెళ్లిపోగా 10 మందే ఉన్నారు. ఇప్పుడు 7 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో మొత్తం 17 మంది అవుతారు. అసలు రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో అని బిగ్ బాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారా..? త్రిబుల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా ఎప్పటి లాగే ఒకరే ఎలిమినేట్ అవుతారా అనేది సండే ఎపిసోడ్ లో తెలుస్తుంది.

ALSO READ: ఆ తోపు లేకుండానే బరిలోకి టీమిండియా.. అయినా ఆస్ట్రేలియాకు బడితపూజే..!

#bigboss-7
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe