Bigg Boss 7 Telugu: పాము ఎవరు, నిచ్చెన ఎవరు..? ఇంటి సభ్యులకు నాగార్జున గేమ్
బాస్ సీజన్ 7 ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసే వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. ఇక ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో నాగార్జున ఇంటి సభ్యులకు కాస్త గట్టిగానే క్లాస్ ఇచ్చినా, ఆ తర్వాత హౌజ్ మేట్స్ తో చాలా ఫన్ చేశారు. ఇక హౌజ్ మేట్స్ కి నాగార్జున ఇచ్చిన టాస్క్ ' నిచ్చెన ఎవరు, పాము ఎవరు ' ఈ టాస్క్ లో ఇంటి సభ్యులు వాళ్ళ ఆటకు నిచ్చెనలా సహాయపడేదెవరు పాములా కాటేసేదెవరని చెప్పాలి అంటూ నాగర్జున హౌజ్ మేట్స్ కి ఒక చిన్న ఫిట్టింగ్ పెట్టారు.