Bigg Boss 7 Telugu: భోలే షావలి భజన..అర్జున్ స్ట్రాటజీ సూపర్..!

బిగ్ బాస్ ఇచ్చిన మూడో టాస్క్ 'హూ ఇస్ స్ట్రాంగెస్ట్' టాస్క్ లో పోటుగాళ్లు గెలిచి, వాళ్ళు స్ట్రాంగెస్ట్ అని నిరూపించుకున్నారు. ఈ టాస్క్ లో అర్జున్ సూపర్ స్ట్రాటజీ వేసి వాళ్ళ టీమ్ ను గెలిపించాడు.

Bigg Boss 7 Telugu:   భోలే షావలి భజన..అర్జున్ స్ట్రాటజీ సూపర్..!
New Update

బిగ్ బాస్ సీజన్ 7(Big boss 7 season) లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా వచ్చిన పోటుగాళ్లు vs ఆటగాళ్లు గా గేమ్ సాగుతుంది. ఇప్పటికే బిగ్ బాస్ కెప్టెన్సీ కోసం ఇచ్చిన రెండు టాస్క్ ల్లో పోటుగాళ్లే గెలిచారు. బిగ్ బాస్ ఇచ్చిన మూడో టాస్క్ 'హూ ఇస్ స్ట్రాంగెస్ట్' టాస్క్ లో కూడా మళ్లీ పోటుగాళ్లే గెలిచి వాళ్ళు స్ట్రాంగెస్ట్ అని నిరూపించుకున్నారు. ఈ టాస్క్ లో అర్జున్ సూపర్ స్ట్రాటజీ వేసి వాళ్ళ టీమ్ ను గెలిపించాడు.

ప్రశాంత్ కోసం కన్నీళ్లు పెట్టుకున్న శివాజీ

బిగ్ బాస్ ప్రశాంత్ కెప్టెన్సీ రద్దు చేయడంతో శివాజీ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రశాంత్ కోసం తను చేసిన త్యాగం వృదా అయ్యిందని బాధపడ్డాడు.

అశ్విని కి భోలే షావలి భజన

అశ్వినీ, భోలే షావలి ఇద్దరు సోఫాలో కూర్చుంటారు. ఇక భోలే అశ్వినీ భజన మొదలు పెట్టాడు... నీ చిరునవ్వు చూస్తే చాలు ఆకలే అవ్వదు, పాల ప్యాకెట్ బదులు నీ పాల బుగ్గలు చూస్తే చాలు, ఇంత అందమైన అమ్మాయి.. పుత్తడి బొమ్మ రా నువ్వు అంటూ పొగిడేస్తున్నాడు. దానికి అశ్వినీ బిగ్ బాస్ ఏంటిది అంటూ నవ్వింది.

అర్జున్ స్ట్రాటజీ సూపర్

కెప్టెన్సీ టాస్క్ లో నిన్న మూడో లెవెల్ లో జరిగిన హూ ఈజ్ స్ట్రాంగ్ అనే టాస్క్ లో ఆటగాళ్ల టీం నుంచి యావర్, పోటుగాళ్ళు టీం నుంచి అర్జున్ పోటీపడ్డారు. ఈ టాస్క్ లో అక్కడ ఉన్న రెండు రాకెట్స్ ని ఎక్కువ సేపు హోల్డ్ చేసిన వాళ్లే విన్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. గేమ్ స్టార్ట్ అయిన కొంత సమయానికే అర్జున్ ఒక చేతిలోని రాకెట్ వదిలేశాడు. యావర్ మాత్రం రెండు చేతుల్లో ఉన్న రాకెట్స్ ని అలాగే పట్టుకున్నాడు. దాంతో అందరు యావరే విన్ అవుతాడని అనుకున్నారు, కానీ కాసేపటి తర్వాత అర్జున్ కంటే ముందే యావర్ వదిలేశాడు. ఇక్కడ అర్జున్ సూపర్ స్ట్రాటజీ వేశాడు... ఒక చేతిలోని రాకెట్ ను ముందుగానే వదిలేసి ఎనర్జీ సేవ్ చేసుకొని ఇంకో చేతిలో ఉన్న రాకెట్ ను ఎక్కువ సమయం హోల్డ్ చేయగలిగాడు. దాంతో పోటుగాళ్ళు టీం విన్ అయ్యింది.

ALSO READ: ప్రభాస్ తీరుపై శ్యామలాదేవి ఆవేదన..కృష్ణంరాజు చివరి కోరిక తీర్చలేదంటూ..

#bigboss-7
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe