Trump-Biden: ట్రంప్‌ పై దాడిని ఖండించిన బైడెన్‌!

ట్రంప్‌ పై కాల్పుల ఘటనను అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తీవ్రంగా ఖండించారు. కాల్పుల ఘటన గురించి భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమెరికాలో హింసకు చోటు లేదని పేర్కొన్నారు.

Trump-Biden: ట్రంప్‌ పై దాడిని ఖండించిన బైడెన్‌!
New Update

Trump-Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ర్యాలీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌ వేదిక ప్రసంగిస్తుండగా..దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడు.

ఈ కాల్పుల్లో ట్రంప్‌ చెవికి గాయమైంది. ఈ కాల్పుల్లో ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి కూడా మృతి చెందినట్లు నిఘా వర్గాలు వివరించాయి. ఈ క్రమంలోనే కాల్పులకు తెగబడ్డ దుండగుడిని భద్రతా బలగాలు హతమార్చినట్లు సమాచారం.

కాల్పులు జరిపిన తరువాత ట్రంప్‌ స్టేజి పై నుంచి కింద పడిపోయారు. భద్రతా సిబ్బంది వెంటనే ట్రంప్‌ చుట్టూ వలయంలా ఏర్పడ్డారు. వెంటనే ట్రంప్‌ ని వేదిక మీద నుంచి కిందకి దింపి సురక్షితంగా తీసుకుని వెళ్లినట్లు భద్రతాధికారులు తెలిపారు.

ఖండించిన బైడెన్‌!

ట్రంప్‌ పై కాల్పుల ఘటనను అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తీవ్రంగా ఖండించారు. కాల్పుల ఘటన గురించి భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమెరికాలో హింసకు చోటు లేదని పేర్కొన్నారు.

Also Read: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ పై కాల్పులు.. !

#joe-biden #donald-trump
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి