Chandrababu: జైల్లో చంద్రబాబును చూసి భువనేశ్వరి కంటతడి

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును చూసి భార్య భువనేశ్వరి కంటతడి పెట్టుకోగా.. అధైర్య పడవద్దని నిబ్బరంగా ఉండాలన్న చంద్రబాబు ఓదార్చారు. ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణితో కలిసి అచ్చెన్న చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, జైల్లో వసతులపై చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు.

New Update
Chandrababu: జైల్లో చంద్రబాబును చూసి భువనేశ్వరి కంటతడి

Chandrababu: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును చూసి భార్య భువనేశ్వరి కంటతడి పెట్టుకోగా.. అధైర్య పడవద్దని నిబ్బరంగా ఉండాలన్న చంద్రబాబు ఓదార్చారు. ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణితో కలిసి అచ్చెన్న చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, జైల్లో వసతులపై చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. మరోవైపు అరెస్ట్ నేపథ్యంలో ప్రజల్లో వస్తున్న స్పందనను వివరించినట్లు సమాచారం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు బాసటగా నిలవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం త్యాగాలకు సిద్ధంగా ఉండాలని బాబు చెప్పినట్లు తెలుస్తోంది. ములాఖత్ నిబంధనల ప్రకారం 45 నిమిషాల పాటు వీరి సమావేశమయ్యారు. అనంతరం జైలు నుంచి వచ్చాక అచెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబుకు ఏమైనా జరిగితే జగనే బాధ్యుడు..

జైలులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏమైనా జరిగితే దానికి సీఎం జగనే బాధ్యుడు అవుతారని రాష్ట్ర అధ్యక్షడు అచ్చెన్నాయుడు పేర్కొ్న్నారు. అరెస్టులకు భయపడే వాళ్లం కాదని.. చంద్రబాబుకి జరిగిన అన్యాయంపై ఢిల్లీ స్థాయిలో పోరాడటానికి లోకేష్ అక్కడికి వెళ్లారన్నారు. అరెస్టులకు భయపడి వెళ్లిపోయారని వైసీపీ నేతలు అనడం సరైంది కాదని తెలిపారు. సంబంధంలేని కేసులో చంద్రబాబుని అరెస్టు చేశారని.. కనీస ఆధారం కూడా లేకుండా కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. అరెస్టు చేసిన తర్వాత ఆధారాలు సంపాదిస్తామనడం సరికాదన్నారు.

చంద్రబాబు ఉన్న చోట దోమలు విపరీతంగా ఉన్నాయి..

ఇప్పటికి 16 రోజులు దాటిందని.. ఇప్పటి వరకు చిన్న ఆధారాన్ని కూడా చూపించలేకపోయారన్నారు. డబ్బులు ఎవరికి చేరాయన్న దానిపై ఆధారాలు చూపించలేదని పేర్కొన్నారు. కస్టడీలో సీఐడీ అధికారులు మొత్తం 33 పనికిమాలిన ప్రశ్నలు వేశారని.. వారు అడిగిన ప్రతి ప్రశ్నకు చంద్రబాబు నిర్భయంగా సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు ఉన్న చోట అపరిశుభ్రంగా ఉందని.. దోమలు విపరీతంగా ఉన్నాయన్నారు. ఇక్కడ కేసే లేదు ఇక సీబీఐ విచారణ ఏంటి అంటూ హైకోర్టులో ఉండవల్లి పిటిషన్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

వారం రోజుల్లో లోకేష్ యువగళం పాదయాత్ర..

చంద్రబాబు చాలా ధైర్యంగా ఉన్నారని.. మమ్మల్ని కూడా ధైర్యంగా పోరాటం చేయమని సూచించారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని.. కానీ ఆయన భద్రత పైన తమకు భయంగా ఉందన్నారు. ఈ ప్రభుత్వం డీఐజీ మీద కూడా నిఘా పెట్టిందని ఆరోపించారు. వారం రోజుల్లో లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం అవుతుందని.. ఇందుకోసం పోలీసుల నుంచి అనుమతులు తీసుకుంటామన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేనతో కలిసి పనిచేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.

రూ.300కోట్ల కోసం అవినీతి చేశారనడం హాస్యాస్పదం..

పేదవారి పిల్లలను ఐటీ ఇండస్ట్రీకి పంపించి వాళ్ల కుటుంబాలను తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుది అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా చేసి లక్షల కోట్లు అభివృద్ధి కోసం ఖర్చుపెట్టిన వ్యక్తి కేవలం రూ.300 కోట్ల కోసం అవినీతి చేశారనటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవాచేశారు. 70 దేశాల్లో యువత ఈరోజు చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నారని.. వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నామని అచ్చెన్న వెల్లడించారు.

ఇది కూడా చదవండి: చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదు: నారా భువనేశ్వరి

Advertisment
Advertisment
తాజా కథనాలు